జలుబు, దగ్గు కొన్ని రోజులు లేదా వారాలకు మించి ఉంటూ తలనొప్పి, ముక్కు కారుతుండడం ఉంటే, అది సైనస్ ఇన్ఫెక్షన్ కావచ్చు. చలికాలంలో జలుబు, దగ్గు, అలెర్జీల కారణంగా సైనస్ సమస్య రావొచ్చు.
pexels
By Bandaru Satyaprasad Dec 03, 2024
Hindustan Times Telugu
దుమ్ము, ధూళి, వాతావరణ పరిస్థితులు, పెంపుడు జంతువులు సైనస్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీయవచ్చు. చలికాలంలో సైనస్‌ల వాపునకు దారితీస్తుంది.
pexels
సైనస్ ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు ముక్కు కారడం, తలనొప్పి. శీతాకాలంలో సైనస్ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
pexels
క్రిములు చేతుల ద్వారా నోటిలోకి ప్రవేశించి జలుబు, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా భోజనం చేసే ముందు, బయటి నుంచి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
pexels
పెంపుడు జంతువులకు వెంట్రుకలు ఇంట్లో పడకుండా జాగ్రత్త తీసుకోండి. దుమ్ము, ధూళి ఇళ్లలోకి రాకుండా కిటికీలు మూసి ఉంచండి.
నాసల్ స్ప్రేని ఉపయోగించండి- నాసల్ స్ప్రే ముక్కు భాగాలను తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
pexels
దుమ్ము, కాలుష్య కారకాలు, అలర్జీలు సైనస్ సమస్యను తీవ్రతరం చేస్తాయి. చల్లని వాతావరణంలో బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి.
pexels
సైనస్‌లో నొప్పి, ఒత్తిడిని నివారించడానికి ఇంట్లో హ్యుమిడిఫైయర్ ను ఉపయోగించండి. వైద్యుల సూచనలతో ఆవిరి పట్టండి. సైనస్‌లు డ్రై అవ్వకుండా తగినంత నీరు తాగాలి.
pexels
తాజా పండ్లు, కూరగాయలు, పోషకాహారం తీసుకోండి. సైనస్ సమస్యలను కలిగించే ప్రాసెస్డ్, జంక్, ఆయిల్ ఫుడ్స్‌ను నివారించండి. అలాగే, మద్యం, ధూమపానానికి నో చెప్పండి.
pexels
బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.