రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. పిల్లల ఆరోగ్యానికి పాలు కూడా చాలా ముఖ్యమైనవి.
Unsplash
By Anand Sai
Sep 12, 2024
Hindustan Times
Teluguప్రస్తుతం అందరూ ప్యాకెట్ పాలపైనే ఆధారపడుతున్నారు. అయితే వీటిని ఎక్కువగా మరిగించి తాగితే ప్రయోజనాలు పొందలేరా?
Unsplash
ప్యాకెట్ పాలను ఇలా మరిగించడం మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ప్యాక్ చేసిన పాలు పాశ్చరైజ్ చేస్తారు.
Unsplash
పాలను సాధారణంగా 71 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేస్తారు. వివిధ రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణమయ్యే అన్ని బ్యాక్టీరియా చంపుతారు.
Unsplash
పాశ్చరైజ్డ్ పాలను మళ్లీ మరిగించడం వల్ల పాలలోని పోషక విలువలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
ఇప్పటికే ఈ పాల ప్యాకెట్ 71 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉడకబెట్టి, వివిధ ప్రక్రియలకు లోనవుతుంది. చివరకు మీ చేతికి చేరుతుంది.
Unsplash
మీరు కూడా 100 డిగ్రీల సెల్సియస్ పైన ఉడకబెడితే.. పాలలోని పోషకాలు, ప్రాథమిక విటమిన్లు దెబ్బతింటాయి.
Unsplash
ప్యాకెట్ పాలను గంటల తరబడి మరిగించడం కంటే 5 నిమిషాలు వేడి చేయడం మంచిది. అదే రోజు ఉపయోగించాలి.
Unsplash
దానిమ్మ తొక్కల పొడితో టీ - ఈ ప్రయోజనాలు తెలుసుకోండి
image credit to unsplash
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి