బరువు పెరగాలంటే ఎండుద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు, బీన్స్, మొక్కజొన్న, బంగాళాదుంపలు బీన్స్, కాయధాన్యాలు మొదలైనవి ఎక్కువగా తినాలి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
image credit to unsplash
పాలు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు మొదలైనవి తాగడం వల్ల శరీరానికి సరిపడా కేలరీలు అందుతాయి. ఇవి మీరు బరువు పెరిగేందుకు దోహదపడతాయి.
image credit to unsplash
బరువుతో పాటు కండరాలు పెరగాలంటే వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.
image credit to unsplash
బరువు పెరగాలని చూస్తే నట్ బటర్స్ సరైన ఎంపిక. గింజలు చాలా క్యాలరీలను కలిగి ఉంటాయి. అయితే చక్కెర లేదా అదనపు నూనెలు లేని నట్ బటర్‌లను తినాలి.
image credit to unsplash
ఆలుగడ్డలలో కార్బోహైడ్రేట్లు చాలా ఉంటాయి. సులభంగా బరువు పెరిగేందుకు ఆలు గడ్డలు, ఇతర దుంపలను తినవచ్చు.
image credit to unsplash
కండరాలను పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలలో గుడ్లు ఒకటి. ఇవి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల గొప్ప కలయికను అందిస్తాయి. అయితే ఎగ్ వైట్ ను వేరుచేయకుండా మొత్తం గుడ్డును తినడం కూడా చాలా ముఖ్యం.
image credit to unsplash
మటన్ వంటి రెడ్ మీట్‌లు కండరాలను పెంచే ఉత్తమమైన ఆహారాలలో ఒకటి. కొవ్వు మాంసం ఎక్కువ కేలరీలను అందిస్తుంది. ఇది మీరు బరువు పెరగడానికి సహాయపడుతుంది.
image credit to unsplash
బరువు తగ్గడానికి కీటో డైట్ ఫాలో అవుతుంటారు. ఈ డైట్ లో హై కొలెస్ట్రాల్, తక్కువ కార్పొహైడ్రేట్స్ ఆహార ప్రణాళిక ఉంటుంది. దీంతో అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.