ప్రపంచంలో  650  రకాల తేళ్లు ఉన్నాయి.  భారత దేశంలో  86రకాల తేళ్లు ఉన్నాయి.సాధారణంగా  మనకు ఎర్రతేళ్లు, నల్లతేళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. 

By Bolleddu Sarath Chandra
Sep 23, 2024

Hindustan Times
Telugu

ఆకారంలో నల్లతేలు పెద్దగా ఉన్నా, వాటి కాటుతో ప్రాణహాని ఉండదు. ఎర్రతేలు చిన్నగా ఉన్నా దాని కాటు ప్రమాదకరం...

తేలు కుట్టిన చోట నొప్పి, మంట, ఎర్రగా కందిపోవడం, వాపు ఉంటాయి.. తేలు కుట్టిన మంట పైకి పాకుతున్నట్టు ఉంటుంది.

తేలు కాటు తీవ్రతకు  విపరీతమైన చెమటలు పడతాయి.విషం గుండెకు పాకితే  ఆయాసం, గుండెనొప్పి, నాడి బలహీనంగా కొట్టుకోవడం, నోటి వెంట నురగలు వస్తాయి.

తేలుకాటుతో పిల్లల్లో మరణం సంభవిస్తుంది, విషం గుండెకు పాకితే  హార్ట్‌ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ జరగొచ్చు.

తేలు కుట్టిన  సెకన్ల వ్యవధిలో విషం రక్తంలో కలుస్తుంది, కుట్టిన పై భాగంలో తాడుతో కట్టడం వల్ల ఉపయోగం ఉండదు...

నొప్పి తగ్గడానికి ఐస్ ముక్కలు పెట్టడం, ఆల్కహాల్‌ చుక్కలు వేయడం ద్వారా ఉపశమనం ఉంటుంది..

తేలు కాటుకు ఔషధంగా ఇన్సులిన్‌ పనిచేస్తున్నట్టు వైద్య పరిశోధనల్లో గుర్తించారు. తేలు కాటుకు గురైన వారిలో ఇన్సులిన్ తగ్గుతున్నట్టు గుర్తించారు. 

తేలు కుట్టిన తర్వాత నొప్పి తగ్గినా దాని విషప్రభావం వారం పదిరోజులు ఉంటుంది. అది గుండెపై చూపిస్తుంది. వీలైనంత వరకు బరువు పనులకు దూరంగా ఉండాలి. రెండో సారి తేలు కాటుకు గురైన వారిలో  విషాన్ని  తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. వారికి ఖచ్చితంగా వైద్య చికిత్స అందించాలి. 

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels