వయాగ్రా అంటే జనబాహుళ్యంలో రకరకాల ప్రచారాలు ఉన్నా నిజానికి అదొక మందు పేరు..
By Bolleddu Sarath Chandra Sep 25, 2024
Hindustan Times Telugu
ప్రపంచవ్యాప్తంగా లైంగికపటుత్వంలో అత్యంత గుర్తింపు పొందిన ఔషధాల్లో వయాగ్రా ఒకటి...
ఆరోగ్యవంతులు, దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉన్న వారిలో కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ మందు వాడాలనే కుతుహలం ఉంటుంది..
వయాగ్రాను మొదట గుండె జబ్బుల చికిత్సలో ఔషధంగా వినియోగించారు.వయాగ్రా వాడకంతో అంగస్తంభనం పెరిగినట్టు రోగులు చెప్పడంతో లైంగిక పటుత్వ మాత్రలుగా రూపాంతరం చెందాయి.
పురుషాంగానికి రక్తం సరఫరా చేసే నాళాల్లోజబ్బులున్న వారికి, సైక్లిక్ జిఎంపి ఎంజైమ్ సమస్య ఉన్న వారికి, గుండె, షుగర్ వ్యాధి లేని మధ్య వయసు వారికి ఈ మందులు ఉపయోగపడతాయి
మగవారిలో పురుషాంగం పటుత్వం, పురుషాంగంలో ఉండే సైక్లిక్ జిఎంపి ఎంజైమ్‌పై ఆధారపడి ఉంటుంది.సైక్లిక్ జిఎంపి ఎంజైమ్‌ను ఫాస్ఫోడయోస్పరేజ్ 5 ఎంజైమ్‌ను త్వరగా కరిగిస్తుంది.
వయాగ్రా ప్రాచుర్యం పొందిన మందు పాస్ఫోడయెస్ఫరేజ్-5కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.దీంతో సైక్లిక్ జిఎంపి ఎంజైమ్ ఎక్కువ సేపు పురుషాంగంలో ఉండేలా రసాయిన చర్య జరుగుతుంది.
పురుషాంగానికి రక్తం సరఫరా చేసే నాళాల్లోజబ్బులున్న వారికి, సైక్లిక్ జిఎంపి ఎంజైమ్ సమస్య ఉన్న వారికి, గుండె, షుగర్ వ్యాధి లేని మధ్య వయసు వారికి ఈ మందులు ఉపయోగపడతాయి
వయాగ్రా వాడిన వారిలో ఆకస్మిక మరణం, కంటి చూపు సమస్యలు, గుండెకు రక్తం అందకపోవడం, గొంతుమంట, మల ద్వారంలో రక్తం పడటం, కళ్లు తిరగడం వంటి సమస్యలు రావొచ్చు నైట్రో గ్లిజరిన్ మందులు వాడే వారిలో వయాగ్రా మరణానికి దారి తీయొచ్చు.
అంగస్తంభనలో నొప్పి కలగడం, అంగం పూర్వపు స్థానానికి రాకపోవడం, దీర్ఘకాలం వాడితే అలవాటుగా మారే ప్రమాదాలు ఉంటాయి. వైద్యుల సలహా లేకుండా ఈ మందులు వాడటం ప్రాణాంతకం కావొచ్చు.