కలలో తెల్ల పిల్లి కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?

pixabay

By Gunti Soundarya
Aug 20, 2024

Hindustan Times
Telugu

ప్రతి ఒక్కరికీ నిద్రపోతున్నప్పుడు సాధారణంగా కలలు వస్తాయి. కొన్ని మధురమైనవిగా ఉంటే మరికొన్ని మాత్రం వింతగా భయానకంగా అనిపిస్తాయి. 

pixabay

కొంతమందికి పిల్లులు, కాకులు వంటి జంతువులు కూడా కనిపిస్తాయి. మీకు అలా కలలో తెల్ల పిల్లి కనిపించిందా?

pixabay

అయితే మీకు త్వరలో ధనలాభం కలగబోతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. తెల్లపిల్లి కనిపించడం శుభ సంకేతంగా చెబుతారు. 

pixabay

కలలో తెల్ల పిల్లి కనిపించడం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. మీ ఇంటికి త్వరలోనే ధనలక్ష్మీ అడుగుపెట్టబోతుంది అనేదానికి ముందస్తు సంకేతం ఇది. 

pixabay

అకస్మాత్తుగా డబ్బు సంపాదించగలుగుతారు. లేదంటే గతంలో నిలిచిపోయిన డబ్బు సమయానికి మీ చేతికి అందుతుంది. 

pixabay

మీకు కలలో తెల్లపిల్లి కనిపిస్తే వెంటనే లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారికి ప్రీతికరమైన ఖీర్ నైవేద్యంగా సమర్పించండి. 

pixabay

అదే కలలో నల్ల పిల్లి కనిపిస్తే మాత్రం ఇది అశుభానికి సంకేతం. జాతకంలో రాహు దోషం ఉందని సూచిస్తుంది. మీకు ఏదో చెడు జరగబోతుందని అర్థం చేసుకోవాలి. 

pixabay

తెల్ల పిల్లి తన బిడ్డతో కనిపిస్తే ఈ కల మిమ్మల్ని త్వరలోనే ధనవంతులను చేస్తుందని అర్థం 

pixabay

ఈ సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. దీన్ని నమ్మడం మీ వ్యక్తిగత విషయం. 

pixabay

రోజూ రాగిజావ తాగితే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash