బ్రౌన్ రైస్ అంటే ఏమిటి? అవెందుకంత ఆరోగ్యం?

pixabay

By Haritha Chappa
Apr 24, 2024

Hindustan Times
Telugu

బ్రౌన్ రైస్ అంటూ ఉంటారు కానీ అవంటే ఏంటో చాలా మందికి తెలియదు. తెల్ల అన్నానికి, వీటికీ తేడా ఏంటో తెలుసుకోండి. 

pixabay

ముదురు రంగులో, దుమ్ము పట్టినట్టు ఉంటాయి దంపుడు బియ్యం. బియ్యాన్ని పాలిష్ పెడితే చాలా తెల్లగా మారుతాయి.

pixabay

కానీ దంపుడు బియ్యానికి మాత్రం పాలిష్ పెట్టరు. అందుకే అవి ముదురు రంగులో ఉంటాయి. 

pixabay

పాలిష్ పెట్టరు కాబట్టే దంపుడు బియ్యం ఎంతో ఆరోగ్యకరమైనవని చెబుతారు పోషకాహార నిపుణులు. 

pixabay

గోధుమరంగులో ఉండే దంపుడు బియ్యాన్ని తినడం వల్ల సెలీనియం శరీరానికి అందుతుంది. దీని వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. 

pixabay

ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తినేవారిలో అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

pixabay

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి దంపుడు బియ్యం ఎంతో మేలు చేస్తాయి. 

pixabay

డయాబెటిస్ ఉన్న వారు తెల్ల అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెరుగుతాయి. 

pixabay

విటమిన్ డి లోపం రాకుండా ఉండాలంటే ఈ 9 ఆహారాలను తినండి

Image Credits : Adobe Stock