వేసవిలో జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతోందా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
May 05, 2024

Hindustan Times
Telugu

వేసవికాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు పొడిగా మారి ఎక్కువగా చిక్కులు పడుతూ ఉంటుంది. ఈ సీజన్‍లో వెంట్రుకలు ఎక్కువగా చిక్కులు పడకుండా ఉండేందుకు ముఖ్యమైన టిప్స్ ఇక్కడ చూడండి. 

Photo: Pexels

వేసవిలో రెగ్యులర్‌గా వెంట్రుకలకు, కుదుళ్లకు నూనె పట్టించాలి. ఆయిల్‍తో బాగా మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల వెంట్రుకలకు హైడ్రేషన్ అంది పొడిబారడం, చిక్కులు పడడం తగ్గుతుంది.  

Photo: Pexels

వేసవిలో తలస్నానం కోసం మాయిశ్చరైజింగ్ రకం షాంపో వాడితే మంచిది. మీ వెంట్రుకలకు సూటయ్యే  మాయిశ్చరైజింగ్ షాంపోను వినియోగించాలి. ఇది మీ జుట్టు, కుదుళ్లకు హైడ్రేటింగ్‍గా చేయగలదు. 

Photo: Pexels

మీ వెంట్రుకల్లోని తేమను సంరక్షించేందుకు కండీషనర్ కూడా ఉపయోగపడుతుంది. కండీషనర్ వాడడం వల్ల జుట్టు మృధువుగా కూడా ఉంటుంది. ఎక్కువగా చిక్కులు పడకుండా ఉంటుంది.

Photo: Pexels

జట్టు చిక్కుపడిన చోట హెయిర్ సీరమ్ వాడడం కూడా మంచిది. వెంట్రుకలకు తేమ అందించి చిక్కులను సీరమ్ తగ్గిస్తుంది. 

Photo: Pexels

నేచురల్ పదార్థాలతో తయారు చేసిన హెయిర్ మాస్కులను జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల కూడా పొడిబారడం తగ్గుతుంది. అరటి పండ్లు, నేచురల్ అయిల్స్, పెరుగు - కోడిగుడ్లతో తయారు చేసిన హెయిర్ మాస్కులు జుట్టుకు వాడితే మేలు. వీటిని జుట్టుకు రాసుకొని 20 నిమిషాల తర్వాత షాంపోతో కడిగేసుకోవాలి. 

Photo: Pexels

గులాబీ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు - ఈ విషయాలు తెలుసుకోండి

image credit to unsplash