గుండె పోటు అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు కొరొనరీ రక్తనాళాల్లో దేంట్లో అయినా అధిరోమాటస్ ఫ్లేక్ పగిలి, రక్తం గడ్డం కట్టి ఆ రక్తం నాళం మూసుకు పోవచ్చు. అప్పుడు ఆ రక్తనాళం సరఫరా చేసే గుండె కండరాలు, కణాలు దెబ్బతింటాయి. దీనినే గుండెపోటు అంటారు. 

By Bolleddu Sarath Chandra
Oct 22, 2024

Hindustan Times
Telugu

గుండె పోటు  రావడానికి ప్రధాన కారణాల్లో రక్తపోటు, మధుమేహం, ధూమపానం, రక్తంలో చెడుకొవ్వు పేరుకుపోవడం,  మానసిక ఒత్తిడి,  స్థలకాయం, రక్తంలో హిమోసిస్టీన్ పెరగడం, లైప్రో ప్రోటిన్ పెరగడం, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారణాలు

గుండెపోటు వస్తే ఛాతీ మధ్యభాగంలో అసౌకర్యంగా, భారంగా, బిగుతుగా ఉండి, నొప్పి ఎడమ చేతివైపు, దవడ వైపు పాకొచ్చు. ఆ సమయంలో తీవ్రమైన ఆందోళన, ఆయాసం, వాంతులు కావడం, చెమట పట్టడం, తాత్కలికంగా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. 

డయాబెటిస్ రోగుల్లో  సాధారణ వ్యక్తుల్లో మాదిరే గుండెపోటు లక్షణాలు ఉండొచ్చు. డయాబెటిస్ రోగులు ఎక్కువ గుండెపోటుతో మరణిస్తారు. డయాబెటిస్ లేని వారితో పోలిస్తే ఉన్న వారిలో, పురుషుల్లో మరణాలు ఎక్కువగా ఉంటాయి. గుండె రక్తనాళాల్లో ఎక్కువ కొవ్వు నిల్వలు పెరగడం దీనికి కారణం

డయాబెటిస్ ఉన్న వారిలో ప్లేట్‌లెట్స్‌ పనితీరులో మార్పులు, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి.  స్ట్రెస్, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ కార్డియో మయోపతి కూడా కారణాలు కావొచ్చు. 

గుండెపోటును ఈసీజీ ఎస్టీ ఎలిమెంట్‌లో తేడాలు గుర్తించొచ్చు. ప్లాస్మా క్రియాటినిన్ కైనేజ్ ఐసో ఎంజైమ్ పెరుగుతుంది. ప్లాస్మాలో కార్డియాక్ ట్రోపోనిన్‌లో పెరుగుదల ఉంటుంది. 

గుండెపోటుకు గురైన వెంటనే వైద్యసాయం అందించే ఏర్పాటు చేయాలి.  రోగి ఆందోళనకు గురి కాకుండా చూడాలి. ఆస్పత్రికి చేరేలోపు ఆస్పిరిన్ 300ఎంజి, క్లొపిడో గ్రిల్ 300 ఎంజి మందులు నేరుగా ఇవ్వొచ్చు. 

గుండెపోటు వచ్చినపుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ పెరుగుతుంది. బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది. కొవ్వు కరగడం వల్ల ఫ్యాటీ ఆసిడ్స్‌ విడుదలై గుండె కండరాలు దెబ్బతినే ప్రాంతం పరిణామం పెరుగుతుంది. 

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels