మొక్కజొన్న కంకులతో ఎన్ని లాభాలో తెలుసా - వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 20, 2024

Hindustan Times
Telugu

మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. 

image credit to unsplash

మొక్కజొన్న కంకుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ ఎ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

మొక్కజొన్నలో ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల వీటిని తరచూ తీసుకుంటే మలబద్ధక సమస్యల నుంచి  ఉపశమనం కలుగుతుంది. 

image credit to unsplash

మొక్కజొన్నలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. బీపీ, గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వాటిని నియంత్రిస్తుంది.

image credit to unsplash

మొక్కజొన్న తినడం వల్ల కళ్లు, చర్మానికి రక్షణగా ఉంటుంది. అలాగే పిల్లల్లో ఎదుగుదలకు, బరువు పెరగడానికి సహకరిస్తుంది.

image credit to unsplash

మొక్కజొన్నలో ఉండే ఫైబర్,  గ్లూటెన్‌లు... మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌, అనీమియా, గుండె వ్యాధులు లాంటివి రాకుండా నిరోధిస్తాయి. 

image credit to unsplash

మొక్కజొన్న కంకులను కాల్చుకొని లేదా ఉడకబెట్టి తినొచ్చు. వీటితో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

image credit to unsplash

లస్సీ తాగితే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash