ఈ వర్షాకాలం వచ్చిందంటే మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యలు జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. అయితే ఆహారంలో తరచుగా అల్లాన్ని తీసుకోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించవచ్చు.
image credit to unsplash
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి మీ శరీరం ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
image credit to unsplash
ప్రతిరోజూ ఉదయం అల్లం నీటిని తాగడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.
అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, రాగి, మాంగనీస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. అల్లం నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శక్తి స్థాయిలను పెంచుతాయి.
image credit to unsplash
అల్లంలో సహజంగా జంజిరల్ అనే పదార్ధం ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫలితంగా డైజేషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.
image credit to unsplash
అల్లం నీరు కేలరీలను బర్నింగ్ చేస్తుంది. శరీరంలో ఆకలి అనుభూతిని తగ్గిస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం... అల్లం శరీర బరువు, బొడ్డు కొవ్వుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
image credit to unsplash
అల్లం పానీయాన్ని ఖాళీ కడుపుతో తాగాలి. ఎందుకంటే ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది
image credit to unsplash
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.