పెరుగుతో బరువు తగ్గొచ్చు..! ఈ విషయాలను తెలుసుకోండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Sep 26, 2024
Hindustan Times Telugu
కేలరీలు ఎక్కువ తీసుకుంటే బరువు ఎక్కువగా పెరుగుతారు. సాదా పెరుగులో కేలరీలు తక్కువుంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం.
image credit to unsplash
పెరుగులో ప్రొబయాటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణశక్తిని పెంచటమే కాదు జీవక్రియ మెరుగుపడుతుంది. ఇవన్నీ బరువు తగ్గించే లక్షణాలు.
image credit to unsplash
పెరుగులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్ మాస్ పెంచుతుంది. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండిన బావననిస్తుంది. దాంతో మనం తినే కేలరీలు తగ్గుతాయి.
image credit to unsplash
పెరుగులో కాల్షియం ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంతో పాటు ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది.
image credit to unsplash
పెరుగులో నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
image credit to unsplash
తాజా బెర్రీలు, యాపిల్స్, అరటిపండ్ల ముక్కల్లో పెరుగు కలుపుకుని తింటే అదనపు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. దీంతో పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
image credit to unsplash
బయట దొరికే ఫ్లేవర్డ్, స్వీటెన్డ్ పెరుగులో ఎక్కువ పంచదార ఉంటుంది. ఇది మీ బరువు తగ్గించే ప్రయత్నానికి ఆటంకమే. అందుకే ఇంట్లో పెరుగు లేదంటే ఎలాంటి ఫ్లేవరింగ్, పంచదార లేని పెరుగు తినాలి.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి