మెంతి గింజలను రాత్రంతా నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Pixabay

By HT Telugu Desk
Mar 28, 2024

Hindustan Times
Telugu

రాత్రంతా మెంతులను నానబెట్టి తింటే బరువు తగ్గడం నుంచి కొలెస్ట్రాల్ నియంత్రణ వరకు ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం.

pixa bay

అమ్మమ్మల కాలంలో మెంతులను రోజూ నానబెట్టి నీళ్లు తాగడం ఆనవాయితీగా ఉండేది. మెంతుల్లో నానబెట్టిన నీటిలో  అనేక ఔషధ గుణాలు ఉన్నాయి

Freepik

మెంతికూర ఇన్సులిన్ సమతుల్యతను కాపాడుతుంది. కాబట్టి ఇది రక్తంలో చక్కెరస్థాయిని అదుపులో ఉంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది.

pixa bay

ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది, కాబట్టి ప్రతిరోజూ ఉదయం మెంతి నీరు త్రాగటం వల్ల గుండె సమస్యలను నివారించవచ్చు.

pixa bay

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.

Freepik

ఉదయాన్నే పరగడుపున మెంతి నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలంటే ప్రతిరోజూ ఉదయం మెంతి నీళ్లు తాగాలి.

Freepik

మెంతులను పెరుగులో నానబెట్టుకొని తినడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels