6 నెలలు నిండిన పిల్లలకు ఏమేం తినిపించొచ్చు?

freepik

By Koutik Pranaya Sree
Jul 26, 2024

Hindustan Times
Telugu

ఉగ్గు తినిపించడం మొదలు పెట్టవచ్చు. 

pexels

ఉగ్గు తయారీ కోసం మూడు వంతుల బియ్యానికి, ఒక వంతు పప్పులు (కంది, పెసర్లు, మసూర్ పప్పు) కలిపి తీసుకోవాలి. వీటిని బాగా కడిగి వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. 

pexels

ఈ పొడిని ఒక చెంచా తీసుకుని సగం కప్పు నీళ్లలో ఉడికించి చల్లారాక తినిపించాలి.

freepik

క్యారట్స్ ఆవిరి మీద ఉడికించి మెత్తగా మెదిపి తినిపించొచ్చు.

క్యారట్ మరీ గట్టిగా అనిపిస్తే ఒకసారి మిక్సీ పట్టి తినిపించాలి. కానీ మరీ జారుడుగా ఉండకూడదు.

ఇదే పద్ధతిలో గుమ్మడికాయ, చిలగడ దుంపలు చెక్కుతీసి మెత్తగా ఉడికించి ప్యూరీలా ఇవ్వవచ్చు.

pexels

అరటి పండు మెత్తగా మెదిపి తినిపించవచ్చు.

pexels

యాపిల్ కూడా తొక్క తీసి మెత్తగా మెదిపి పెట్టాలి.

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels