మనం వాడే వంట నూనెల్లో చాలా రకాలు ఉంటాయి. వాటి ఉపయోగాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి నూనెలో మంచిచెడులు ఉంటాయి. వంట నూనెల వినియోగంలో రెండు, మూడు రకాలను కలిపి వినియోగించడం మేలు
By Bolleddu Sarath Chandra Sep 30, 2024
Hindustan Times Telugu
వేరుశనగ నూనె భారత దేశంలో అతిసాధారణంగా ఉపయోగించే వంట నూనె. ఇందులో MUFA వుండి, చెడు కొలెస్టరాల్ తగ్గిస్తుంది.
ఆలివ్ ఆయిల్ ఖరీదు ఎక్కువ. కొలెస్టరాల్ తగ్గించడం ద్వారా గుండెపోటును తగ్గిస్తుంది. రక్తంలో గడ్డకట్టే లక్షణాలను తగ్గిస్తుంది. ఇది పొట్టలో కొవ్వును పేరుకోనివ్వదు. కొన్ని రకాలైన కేన్సర్ జబ్బులు, డయాబెటిస్ రాకుండా కాపాడుతుంది.
సోయాబీన్ ఆయిల్ వేపుళ్ళు చేయడానికి ఉపయోగపడదు. ఇందులో లినాలియాక్ ఆసిడ్ మరియు ఆల్ఫా లినోలియాక్ ఆసిడ్ ఉంటాయి.
మస్టర్డ్ ఆయిల్ లో MUFA, PUFA లు అధికంగా వుంటాయి. ఇందులో ఎరూసిక్ ఆసిడ్ అనే ప్రమాదకరమైన పదార్థము వుంటుంది. ఆ పదార్థస్థాయిని తగ్గించడానికి ఇతర నూనెలతో కలిపి వాడడం మంచిది.
రైస్ బ్రాన్ ఆయిల్ : ఇతర నూనెలతో పోలిస్తే ఖరీదు కొంత తక్కువ. MUFA ఎక్కువగా వుంటాయి. దీనిలోని ఒరీజినాల్ అన్న పదార్థం కొలెస్టరాల్ను తగ్గిస్తుంది. ఇందులో విటమిన్-ఇ, స్క్వాలిన్ వంటి పదార్థాలు వుంటాయి. దీనితో తయారు చేసిన ఆహార పదార్థాలు, వేరుశనగ నూనెతో పోలిస్తే 12-25% వరకు తక్కువ నూనెను గ్రహిస్తాయి.
ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనె లేదా రిఫైన్డ్ ఆయిల్‌లో PUFA ఎక్కువగా వుంటాయి. ఇవి మంచి, చెడు కొలెస్టరాల్ రెండింటినీ తగ్గిస్తాయి. కనుక ఈ నూనెను ఒక్కటే వాడటం మంచిది కాదు. కనుక ఒక రోజు పామాయిల్, ఇంకో రోజు ఈ నూనెను వాడటం మంచిది. ఇందులో PUFA ఎక్కువగా వుంటాయి. కనుక లినోలియిక్ ఆసిడ్ తక్కువగా వుండే పామాయిల్ తో కలిపి వాడాలి.
పామాయిల్ : ఇందులో PUFA లు వుంటాయి. లినోలియక్ ఆసిడ్ తక్కువగా వుంటుంది. కనుక ఇతర నూనెలతో కలిపి వాడాలి.
కొబ్బరినూనెలో సాటురేటెడ్ ఫ్యాట్స్ వుంటాయి. కాని కొలెస్టరాల్ వుండదు.
చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఇవి తప్పక తీసుకోండి