కూల్ డ్రింక్స్‌లో ఏముంటుంది, తాగితే ఉపయోగం ఏమిటి?
By Bolleddu Sarath Chandra Sep 12, 2024
Hindustan Times Telugu
శీతలపానీయాల్లో ఏముంటుందో మనలో చాలామందికి తెలియదు, అవి తాగడం ఆరోగ్యానికి మంచిదో కాదో కూడా అవగాహన ఉండదు.
శీతల పానీయం రంగును బట్టి వాటిలో రసాయినాలు ఉంటాయి, ఎరుపు రంగులో కార్మాయిసిస్, ఎరిథ్రోమైసిన్, పసుపులో టారాజైన్, నీలి రంగు పానీయాల్లో ఇండిగో, ఆకుప్చలో ఫాస్ట్ గ్రీన్, ఇ-150 రసాయినాలు ఉంటాయి
శీతల పానీయాల వ్యర్థాల్లో ప్రతి కిలోకు కాడ్మియం లోహ అవశేషాలు 201.8 మి.గ్రా ఉన్నట్టు పరిశోధనల్లో స్పష్టమైంది
కూల్ డ్రింక్స్ తియ్యగా ఉండటానికి ఎస్పిరటం అనే కెమికల్ కలుపుతారు, అతిగా సేవిస్తే పిల్లల్లో బ్రెయిన్ హ్యామరేజీ రావొచ్చు
దేశంలో వినియోగిస్తున్న 12 పాపులర్ డ్రింక్స్‌లో మోతాదుకు మించిన పురుగు మందుల అవశేషాలు ఉన్నట్టు సిఎస్‌ఈ పరిశోధనల్లో వెలుగు చూసింది.
దేశంలో విక్రయించే కూల్ డ్రింక్స్‌లో 16రకాల ఆర్గనో క్లోరిన్ పురుగు మందులు, 14 రకాల ఆర్గానో ఫాస్పరస్ పురుగు మందులు, 4 రకాల సింథటిక్ పైరిథ్రాయిడ్స్ ఆనవాళ్లు ఉన్నాయి.
లిండేన్, డిడిటి వంటి క్రిమిసంహారకాలతో కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం జరగొచ్చు. యూరోపియన్ కమిషన్ అనుమతించిన పరిణామం కంటే దేశంలో 42రెట్లు అధికంగా డిడిటి ఆనవాళ్లు ఉంటున్నాయి.
శీతల పానీయాల్లో మలాథియాన్ మోతాదు మించితే లివర్‌లో మాలాక్సన్‌గా మారి ప్రమాదానికి కారణం అవుతుంది. శరీరంలోని క్రోమోజోమ్ వ్యవస్థ మీద ప్రభావం చూపి అనారోగ్యానికి దారి తీస్తుంది.
క్లోరోఫైరిఫాస్ ఉన్న పానీయాలు గర్బిణీలు తాగితే లోపాలతో ఉన్న శిశువులు జన్మించడం, పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతినడం, పిండం పెరుగుదలలో లోపాలు తలెత్తుతాయి.
ఇన్ని రసాయినాలతో కూడిన శీతలపానీయాలు తాగాలో వద్దో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి...
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి