బరువు తగ్గడానికి కీటో డైట్ ఫాలో అవుతుంటారు. ఈ డైట్ లో హై కొలెస్ట్రాల్, తక్కువ కార్పొహైడ్రేట్స్ ఆహార ప్రణాళిక ఉంటుంది. దీంతో అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
pexels
By Bandaru Satyaprasad Sep 25, 2024
Hindustan Times Telugu
జీర్ణ సమస్యలు - కీటో డైట్ లో తక్కువ ఫైబర్, కార్పొహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇది జీర్ణ వ్యవస్థ, పేగు కదలికలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
pexels
పోషక లోపాలు - కీటో డైట్ లో కొన్ని ఆహారాలను తొలగిస్తారు. దీంతో మెగ్నీషియం, పొటాషియం, బి విటమిన్ల లోపాలకు దారితీయవచ్చు.
pexels
కొలెస్ట్రాల్ స్థాయిలు - కీటో డైట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచేందుకు దోహదపడుతుంది. తద్వారా గుండె సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.
pexels
బ్లడ్ షుగర్ లెవల్స్ - టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో కీటో డైట్ రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ లేదా హైపోగ్లైసీమియాకు కారణం కావొచ్చు. అయితే ఇతర పరిస్థితుల్లో చక్కెర స్థాయిలను స్థిరీకరించి, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరిచేందుకు కీటో డైట్ సహాయపడుతుంది.
pexels
పీరియడ్స్ పై ప్రభావం- రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చేలా చేసేందుకు డైట్ కీలక పాత్ర పోషిస్తుంది. కీటో డైట్ వల్ల హార్మోన్ల బ్యాలెన్స్ పై ప్రభావితం చూపి మహిళల్లో రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవచ్చు.
pexels
డీహైడ్రేషన్ - కీటో డైట్ అనుసరిస్తే మీరు డీహైడ్రేషన్ కు గురవుతారు. శరీరం కొలెస్ట్రాల్ ను బర్న్ చేయడానికి గ్లూకోజ్ కు బదులుగా కీటోన్ లను ఉత్పత్తి చేసినప్పుడు...శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్ ల నష్టానికి దారితీయవచ్చు. ఇది హైడ్రేషన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
pexels
మూడ్ స్వింగ్స్ - తక్కువ కార్పొహైడ్రేట్స్ ఆహారం హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇది వ్యక్తి మానసిక స్థితి, భావోద్వేగ సమతుల్యతపై ఎఫెక్ట్ చూపుతుంది.
pexels
కిడ్నీ స్టోన్స్ - కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కీటోజెనిక్ డైట్ కారణం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అధిక కొవ్వు పదార్థాలు వినియోగం దీనికి కారణం. దీర్ఘకాలిక మూత్రపిండల వ్యాధి ఉన్నవారు కీటో డైట్ ఫాలో కాకపోవడమే మంచిది.
pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!