వైద్యం తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా దగ్గు తగ్గడం లేదా?
By Bolleddu Sarath Chandra Sep 16, 2024
Hindustan Times Telugu
చాలా సందర్భాల్లో దగ్గు సమస్యకు నీటి ఆవిరి వైద్యం ఉపకరిస్తుంది.
నీటిని బాగా మరిగించడం ద్వారా వచ్చే ఆవిరి లేదా స్టీమింగ్ యంత్రాల ద్వారా ఆవిరి పట్టొచ్చు..
ముక్కు ద్వారాల్లోకి నీటి ఆవిరిని నేరుగా నోటితో పీల్చడం ద్వారా ఉపశమనం లభిస్తుంది...
breathing problems
ముక్కు దిబ్బడ తగ్గడానికి, బ్రాంకైటిస్,న్యూమోనియా, ఫ్లూ వంటి సందర్భాల్లో కూడా ఆవిరి పీల్చడం ద్వారా ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు పేరుకున్న కళ్లె మెత్త బడుతుంది.
కళ్లెను నోటి ద్వారా బయటకు ఉమ్మి వేయడం ద్వారా శ్వాసనాళాల్లో ఉన్న అడ్డంకులు తగ్గుతాయి..
కనీసం ఐదు నిమిషాల పాటు ఇలా నీటి ఆవిరిని రోజుకు రెండు సార్లు పీల్చాలి
మరిగే నీటిలో కొన్ని చుక్కల టించర్ బెంజాయిన్, జామాయిల్, విక్స్, జిందా తిలిస్‌మాత్ వంటివి ఉపయోగించవచ్చు..
ముదిరిన పడిశాన్ని పలుచన చేసి దానిని బయటకు నెట్టడానికి ఆవికి ఉపయోగపడుతుంది.