ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ దూసుకుపోతున్నాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మోగ్గుచూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన అంశాలేంటో చూద్దాం.
twitter
By Bandaru Satyaprasad Sep 24, 2024
Hindustan Times Telugu
బ్యాటరీ కెపాసిటీ - ఈ స్కూటర్ కు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ కలిగిన ఈ-స్కూటర్ ను ఎంచుకోండి. బ్యాటరీ సామర్థ్యం, వారంటీని తెలుసుకోండి. ఎల్జీ, సామ్ సంగ్, పానసోనిక్, సన్యో నుంచి వచ్చిన బ్యాటరీ ప్యాక్‌లు సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ నకు ప్రసిద్ధి.
twitter
ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- ఛార్జింగ్ స్టేషన్‌ల లభ్యత, హోమ్ ఛార్జింగ్ సదుపాయం అంశాన్ని పరిగణనలోకి తీసుకోండి. మీ ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేయండి.
twitter
ఛార్జింగ్ సమయం - ఫాస్ట్ ఛార్జింగ్ ఈ-స్కూటర్‌లో ముఖ్యమైన లక్షణం. ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే మోడల్ ను ఎంచుకోండి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సాధారణంగా 15-30 కి.మీ వస్తుంది. బ్యాటరీ కెపాసిటీని బట్టి 4-20 గంటలు ఛార్జింగ్ టైమ్ ఉంటుంది.
twitter
అత్యధిక వేగం- ఈ స్కూటర్ గరిష్ట వేగాన్ని తనిఖీ చేయండి. కొన్ని స్కూటర్ లు 108 కి.మీల రేంజ్, 63 కిమీ/గం గరిష్ట వేగం ఉన్నాయి.
twitter
యాక్సిలరేషన్ : ట్రాఫిక్‌లో ఎంత తొందరగా వేగాన్ని అందుకుంటుందో...దానిపై స్కూటర్ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. 0-15 ఎంపీహెచ్ వేగాన్ని ఎంత సెకన్లలో అందుకుంటుందో అంచనా వేయండి.
twitter
మెటీరియల్ నాణ్యత : ఈ-స్కూటర్ తయారీకి అధిక నాణ్యత పదార్థాలు వినియోగించారో లేదో తెలుసుకోండి. సాలిడ్ మెటల్ స్కూటర్ లైఫ్ ను పెంచుతుంది. హై-క్వాలిటీ మెటీరియల్స్ స్కూటర్ మన్నికను పెంచుతాయి.
twitter
సీట్ కంఫర్ట్ : లాంగ్ జర్నీకి అనుకూలమైన సీటు, నేచురల్ రైడింగ్ డిజైన్ ను ఎంచుకోండి.
twitter
నావిగేషన్, జీపీఎస్, యాప్ ఇంటిగ్రేషన్ , బ్రేకింగ్ సిస్టమ్, టైర్ల మన్నికను అంశాలు పరిగణనలోకి తీసుకోండి. దీంతో పాటు బలమైన బ్రేకింగ్ సిస్టమ్ ముఖ్యమైన భద్రతా ఫీచర్. ఈ ఫీచర్స్ ఉన్న ఈ-స్కూటర్ల ధరను సరిపోల్చి బెస్ట్ దాన్ని ఎంచుకోండి.
twitter
చలికాలంలో పుదీనాతో ఆరోగ్య ప్రయోజనాలు - తెలిస్తే అస్సలు వదలరు