చర్మం మెరుపును పెంచే  విటమిన్-ఈ పుష్కలంగా ఉండే ఆహారాలు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 19, 2024

Hindustan Times
Telugu

'విటమిన్ ఈ' ఆరోగ్య ప్రయోజనాలను అందించటంతో పాటు చర్మానికి కూడా ఇది మేలు చేస్తుంది. చర్మపు మెరుపు పెంచుతుంది. విటమిన్ ఈ పుష్కలంగా ఉండే ఐదు ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Pexels

పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఫోలెట్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల చర్మపు మెరుపు మెరుగవుతుంది.

Photo: Pexels

బాదంలోనూ విటమిన్ ఈ, ఫ్యాటీ యాసిడ్స్, కాపర్ మెండుగా ఉంటాయి. చర్మం పొడిబరడాన్ని, మచ్చలను బాదం తినడం తగ్గించగలదు.

Photo: Pexels

పాలకూర లాంటి ఆకుకూరల్లో విటమిన్ ఈ, ఏ మెండుగా ఉంటాయి. చర్మం పొడిబారకుండా ఇవి ఉపకరిస్తాయి. 

Photo: Pexels

విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న ఆహారాల్లో వేరుశనగలు కూడా ఉన్నాయి. పొటాషియం, ప్రోటీన్, నియాసిన్ కూడా ఉండే వీటిని తింటే చర్మానికి ప్రయోజనాలు కలుగుతాయి. 

Photo: Pexels

అవకాడోలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, మెగ్నిషియం కూడా ఎక్కువే. చర్మానికి మేలు చేసే యాసిడ్స్ కూడా ఉంటాయి. చర్మంపై ముడతలు తగ్గేందుకు, మెరుపు పెరిగేందుకు అవకాడో సహాయపడుతుంది. 

Photo: Pexels

క్యారెట్, వెల్లుల్లి మిశ్రమంతో చేసిన చట్నీతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు

pexels