వర్షాకాలంలో తడి వాతావరణంతో కొన్ని కూరగాయల్లో అధిక తేమ ఉంటుంది. అధిక తేమ బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.  

pexels

By Bandaru Satyaprasad
Jun 29, 2024

Hindustan Times
Telugu

వర్షాకాలంలో తినకూడని 5 కూరగాయలను గురించి తెలుసుకుందాం.  

pexels

గ్రీన్ లీఫీ వెబిటబుల్స్ - బచ్చలికూర, మెంతులు, కాలే వంటి ఆకు కూరలను సులభంగా కలుషితం చేసే వివిధ సూక్ష్మక్రిములు, బాక్టీరియా పెరుగుదలకు వర్షాకాలం అనువైనది. వీటిని తినడం వల్ల అజీర్ణం లేదా ఇన్పెక్షన్ రావచ్చు.  

pexels

కాలీఫ్లవర్, బ్రోకలీ- వర్షాకాలంలో కాలీఫ్లవర్, బ్రోకలీకి దూరంగా ఉండాలి. తేమ కారణంగా వీటిపై బ్యాక్టీరియా చేరుతుంది. ఇది అనారోగ్యానికి కారణం కావొచ్చు.  

pexels

వంకాయలు - వంకాయలు తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి ఆల్కలాయిడ్స్ అనే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి కూరగాయలను విషపూరితం చేస్తాయి. చర్మంపై దురద, వికారం, దద్దుర్లు, అలెర్జీ చర్యలకు ఇవి కారణం కావొచ్చు.  

pexels

బెల్ పెప్పర్స్ - బెల్ పెప్పర్ లను పూర్తిగా శుభ్రచేయడం కష్టం, పచ్చి బెల్ పెప్పర్స్ వర్షాకాలంలో కడుపు ఇన్ ఫెక్షన్లకు దారితీస్తుంది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధికారక క్రిములను ఇవి కలిగి ఉంటాయి.  

pexels

బీన్స్  

pexels

 బీన్స్, బఠానీలు వంటివి వర్షాకాలం తేమ ఎక్కువగా ఉండి శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. వీటిని వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. మీరు వీటిని తినాలనుకుంటే బాగా ఉడికించండి.   

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels