క్షయవాది మైకోబాక్టీరియం ట్యూబరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా సంక్రమణతో వ్యాపిస్తుంది. టీబీ ముఖ్యంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. టీబీ 9 సాధారణ లక్షణాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Mar 26, 2024

Hindustan Times
Telugu

నిరంతర దగ్గు- మూడు వారాల కంటే ఎక్కువ కాలంగా దగ్గు వస్తుంటే ఇది టీబీ ముఖ్య లక్షణాలలో ఒకటి. దగ్గినప్పుడు కఫం లేదా రక్తం వస్తుంది.   

pexels

జ్వరం- మధ్యాహ్నం లేదా సాయంత్రం తక్కువ స్థాయిలో జ్వరం వస్తుంటుంది. మొదట్లో జ్వరం వస్తూ పోతుంది. కానీ వ్యాధి ముదిరే కొద్దీ నిరంతరంగా ఉంటుంది.  

pexels

రాత్రి చెమటలు- రాత్రి పూట విపరీతంగా చెమటలు, ఉన్నట్టుండి ఒళ్లువేడిగా అవ్వడం వంటి లక్షణాలు టీబీకి సంకేతాలు. రాత్రి పూట చలి జ్వరం, చెమటలు టీబీ లక్షణాలు.  

pexels

అలసట- టీబీ ఉన్న వ్యక్తులు బలహీనంగా, చాలా అలసటకు లోనవుతారు. రోజంతా నీరసంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు విశ్రాంతి తీసుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.      

pexels

 బరువు తగ్గడం- టీబీ లంగ్స్ పై ప్రభావం చూపే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది శరీర బరువు తగ్గడానికి తగ్గడానికి దారితీస్తుంది. ఆకలిని కోల్పోతారు. 

pexels

పోషకాహార లోపం- టీబీ సోకిన వ్యక్తులకు తినాలనే కోరిక తగ్గిపోతుంది. ఇది కూడా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. దీంతో పోషకాహార లోపం కలుగుతుంది.  

pexels

ఛాతీ నొప్పి- టీబీ రోగులలో ఛాతీ నొప్పి వస్తుంటుంది. దగ్గినప్పుడు, బలంగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ నొప్పి తెలుస్తుంది. నొప్పి ఛాతీ మొత్తం వ్యాపిస్తుంటే ఇన్ఫెక్షన్ పెరుగుతుందని తెలుసుకోవచ్చు.  

pexels

శ్వాస ఇబ్బందులు- టీబీ ముదురుతుంటే ఊపిరితిత్తుల వాపు, దెబ్బతినడానికి దారితీస్తుంది. దీని ఫలితంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ శ్వాస తీసుకోవడం మరింత కష్టతరం అవుతుంది.  

pexels

లింప్ నోడ్స్ వాపు- టీబీ కారణంగా లింప్ నోడ్స్ ముఖ్యంగా మెడ, చంకలు, గజ్జల్లో వాపునకు కారణం అవుతుంది.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels