బ్రకోలీ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ కూరగాయను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది. బ్రకోలీ వల్ల కలిగే 6 ప్రయోజనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Unsplash
బ్రకోలీలో కాల్షియమ్, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది తింటే ఎముకల ఆరోగ్యం, దృఢత్వం మెరుగవుతుంది.
Photo: Unsplash
బ్రకోలీలో జింక్, విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఏజింగ్ కారకాలు ఉంటాయి. దీంతో ఇది చర్మానికి కూడా చాలా మంచిది.
Photo: Unsplash
విటమిన్ సీ, యాంటీ ఇన్‍ఫ్లేమటరీ లక్షణాలు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని బ్రకోలీ మెరుగుపరుస్తుంది. బ్రకోలీ తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఇది సహకరిస్తుంది.
Photo: Unsplash
సల్ఫోరఫేన్ అనే బయోయాక్టివ్ కాంపౌండ్ ఉండడం వల్ల బ్రకోలీ… శరీరంలోని షుగర్ లెవెళ్లను తగ్గిస్తుంది. అందుకే బ్రకోలీ తీసుకుంటే షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చాలా అధ్యయానాలు వెల్లడించాయి.
Photo: Unsplash
బ్రకోలీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. జీర్ణ వ్యవస్థకు ఇది మేలు చేస్తుంది.
Photo: Unsplash
మెదడు పనితీరు మెరుగయ్యేందుకు కూడా బ్రకోలీ తోడ్పడుతుంది.
Photo: Unsplash
చలికాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తారు. పెరుగు వల్ల కఫం ఏర్పడుతుందని భావిస్తుంటారు. వైద్య నిపుణులు మాత్రం చలికాలంలో పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.