ఈ శీతాకాలంలో దేశంలో అందమైన ప్రకృతి దృశ్యాలు, అద్భుతమైన ప్రదేశాల్లో అన్వేషించాలనుకుంటున్నారా? అయితే సాటిలేని సాహసాన్ని అందించే ఐదు ఉత్తమ శీతాకాలపు ట్రెక్కింగ్ ప్రదేశాలు మీ కోసం అందిస్తున్నాం.
unsplash
చాదర్ ట్రెక్- మీరు గడ్డకట్టిన జంస్కార్ నదిపై నడుస్తున్నప్పుడు సరికొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు. లడఖ్‌లోని మంచు పర్వతాలలో ఈ ట్రెకింక్ ఉంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి సరైన సమయం.
unsplash
హర్ కి దన్- ఉత్తరాఖండ్‌లో సెట్ చేసిన ఈ ట్రెక్కింగ్ అద్భుతమైన పర్వత దృశ్యాల మధ్య పురాతన స్థానిక సంస్కృతి, గ్రామాల సంప్రదాయాలను అన్వేషించవచ్చు.
unsplash
రూప్‌కుండ్ ట్రెక్- ఇది ఎత్తైన గ్లేసియర్ ప్రాంతాన్ని కలిగి చాలా సవాళ్లు విసిరే ట్రెక్. గడ్డకట్టిన రూప్‌కుండ్ సరస్సు దీనికి ఆధ్యాత్మిక శోభను జోడిస్తుంది.
unsplash
బ్రహ్మతాల్ ట్రెక్ లో త్రిశూల్ పర్వతం, నంద ఘుంటి పర్వతంతో పాటు ఎంతో సుందరమైన శిఖరాలను చూడవచ్చు. 12,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ట్రెక్‌లో పచ్చని అడవులు, గడ్డకట్టిన బ్రహ్మతాల్ సరస్సు కూడా ఉన్నాయి.
unsplash
దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ లో విశాలమైన ఆల్పైన్ పచ్చిక బయళ్లకు నిలయంగా ఉంటుంది. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇది గంగోత్రి, శ్రీకాంత్ శిఖరాల అద్భుతమైన ప్రదేశాలను కలుపుతూ ఉండే 21 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్.
unsplash
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!