ఒత్తిడిని తగ్గించగలిగే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo Credit: Pexels

By Chatakonda Krishna Prakash
Oct 21, 2023

Hindustan Times
Telugu

కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఉపశమనంగా ఉంటుంది. అలా.. ఒత్తిడిని తగ్గించగలిగే 5 ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.

Photo Credit: Freepik

అరటి పండులో మెగ్నిషియమ్ పుష్కలంగా ఉంటుంది. దీంతో అరటి తింటే మీ మూడ్ కాస్త ప్రశాంతంగా మారుతుంది. బ్లడ్ ప్రెజర్‌ కూడా కొంచెం తగ్గుతుంది. దీనిద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గిన ఫీలింగ్ ఉంటుంది. 

Photo Credit: Freepik

సాల్మోన్ లాంటి ఫ్యాటీ ఫిష్‍ల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి తీసుకుంటే మీలోని ఒత్తిడి తగ్గుతుంది.

Photo Credit: Freepik

బ్లూబెర్రీల్లో అతోసియానిన్స్ లాంటి యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో మీలోని ఒత్తిడి, ఆందోళనను ఇవి తగ్గించగలవు. 

Photo Credit: Freepik

చీని, నిమ్మ, ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ -సీ ఎక్కువగా ఉంటుంది. దీంతో స్ట్రెస్ మేనేజ్‍మెంట్‍కు ఈ పండ్లు ఉపయోగపడతాయి. కార్టిసాల్ లెవెల్‍ను ఇవి తగ్గిస్తాయి. 

Photo Credit: Freepik

సోయాబీన్స్, చిక్కుడు కాయలు, కాయధాన్యాలు, సెనగలు లాంటి బీన్స్, చిక్కుళ్లను ఆహారంతో తీసుకున్నా ఒత్తిడి తగ్గుతుంది. వీటిలో విటమిన్ బీ6, మెగ్నిషియమ్ అధికంగా ఉంటాయి. 

Photo Credit: Freepik

మీ జుట్టు రాలడానికి అసలు కారణం ఈ ఆహారాలే.. వెంటనే తినడం ఆపేయండి!

pixabay