డ్రైఫ్రూట్స్‌ను నెయ్యిలో వేయించుకొని తినొచ్చా? లాభాలు ఉంటాయా?

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Apr 21, 2024

Hindustan Times
Telugu

డ్రైఫ్రూట్‍లను నెయ్యిలో వేయించుకొని తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా అని చాలా మందిలో సందేహాలు ఉంటాయి. అలా చేస్తే పోషకాలు అందుతాయా అనే డౌట్ వస్తుంటుంది. 

Photo: Pexels

డ్రైఫ్రూట్స్‌ను నెయ్యిలో వేయించుకొని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నెయ్యి, డ్రైఫ్రూట్‍లలోని పోషకాలు కలిసి ఆరోగ్యానికి అందుతాయి. చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

Photo: Pexels

నెయ్యిలో గుడ్ ఫ్యాట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. పోషకాలు, బరువు తగ్గడం నుంచి చర్మపు ఆరోగ్యం వరకు నెయ్యితో చాలా లాభాలు కలుగుతాయి. 

Photo: Pexels

విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో పాటు మరిన్ని పోషకాలు డ్రైఫ్రూట్స్‌లో ఉంటాయి. వాటిని నెయ్యిలో వేయించుకొని తింటే రుచికరంగా ఉండటంతో పాటు మరింత పోషక విలువలు పెరుగుతాయి.

Photo: Pexels

నెయ్యిలో వేయించిన డ్రైఫ్రూట్స్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆ రెండింటిలోని పోషకాల వల్ల శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. 

Photo: Pexels

డ్రైఫ్రూట్లలోని విటమిన్లను శరీరం మెరుగ్గా అందుకునేలా నెయ్యిలోని ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ సహకరిస్తాయి. పోషకాలు బాగా అందుతాయి. 

Photo: Pexels

డ్రైఫ్రూట్లను నెయ్యిలో ఫ్రై చేసుకొని తినడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్‍గా ఉంటాయి. 

Photo: Pexels

చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి. 

pexels