బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారా! క్యాలరీలు తక్కువుండే ఈ ఐదు స్నాక్స్ తినొచ్చు

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Aug 25, 2023

Hindustan Times
Telugu

బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. అందుకే స్నాక్స్ కూడా క్యాలరీలు తక్కువగా ఉన్నవి తింటే వెయిట్ లాస్‍కు ఉపయోగపడుతుంది. అలా క్యాలరీలు తక్కువగా ఉండే 5 స్నాక్స్ ఏవో ఇక్కడ చూడండి. 

Photo: Unsplash

వేయించిన గుమ్మడి గింజల్లో జింక్, మాగ్నిషియమ్, పొటాషియమ్ లాంటి మరిన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మీ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

Photo: Unsplash

వేడి చేసిన ప్యాన్‍లో గుమ్మడికాయ గింజలు వేయించుకోవాలి. వాటిపై తగినంత ఉప్పు వేసుకొని తినొచ్చు. బరువు తగ్గేందుకు ఇవి ఉపయోగపడతాయి.  

Photo: Unsplash

వేయించిన సెనగల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వేయించిన తర్వాత సెనగలపై కాస్త సాల్ట్, మీకు నచ్చిన సీజనింగ్ ఫ్లేవర్ వేసుకొని తినొచ్చు. వేయించిన సెనగల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. 

Photo: Unsplash

పాప్‍కార్న్ కూడా క్యాలరీలు తక్కువగా ఉండే హెల్దీ స్నాక్. అయితే, వీటిలో వెన్నె సహా ఎక్కువ క్యాలరీలు ఉండే టాపింగ్స్ యాడ్ చేసుకోకూడదు.  

Photo: Unsplash

క్యారెట్‍లో క్యాలరీలు తక్కువగా పోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. క్యారెట్‍ను ముక్కలుగా కట్ చేసి హమ్మస్ నంచుకొని తినొచ్చు. దీని ద్వారా మంచి ప్రొటీన్, కాల్షియమ్ అందుతుంది. 

Photo: Unsplash

మీకు ఇష్టమైన పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని వాటిపై ఉప్పుతో పాటు దాల్చినచెక్క పొడి, మిరియాల పొడి లాంటి మసాల దినుసులు తగినంత మేర వేసుకొని తినొచ్చు. ఇలా పండ్లను స్నాక్‍గా తీసుకున్నా వెయిట్ లాస్‍కు ఉపకరిస్తుంది. 

Photo: Unsplash

శరీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండ‌డం చాలా అవ‌స‌రం. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Unsplash