అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్తే వైద్యుడు మొదట చూసేది మన నాలుకపైనే. వైద్యులు నాలుకను ఎందుకు చూస్తారు?

Unsplash

By Anand Sai
Sep 19, 2024

Hindustan Times
Telugu

నాలుక రంగు మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెబుతుంది. అలాగే నాలుక రంగు మీ శరీరంలోని వివిధ వ్యాధులను సూచిస్తుంది.

Unsplash

నాలుకపై తెల్లటి మచ్చలు ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. ఈ తెల్ల మచ్చలు ఎక్కువగా పిల్లలు లేదా వృద్ధులలో కనిపిస్తాయి.

Unsplash

మీ నాలుక నలుపు రంగులో ఉంటే, అది గొంతు ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియాకు సంకేతం. మందు తరచుగా వాడేవారిలో కూడా నాలుక నల్లగా మారుతుంది.

Unsplash

మీ నాలుక పసుపు రంగులో ఉంటే, అది కామెర్లు యొక్క లక్షణం. కానీ ఇది ప్రారంభ సంకేతం మాత్రమే. నాలుక రంగు మారితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Unsplash

మీ నాలుక గోధుమ లేదా నీలం రంగులోకి మారితే, అది ప్రమాదకరం. గోధుమ రంగు నాలుక గుండె సమస్యలకు సంకేతం.

Unsplash

నాలుక పూర్తిగా లేతగా లేదా లేత గులాబీ రంగులో ఉంటే, అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తహీనత, విటమిన్ B-12 లోపం కూడా దీనికి కారణం కావచ్చు.

Unsplash

మరకలు లేని నాలుక ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. ముదురు గులాబీ రంగు నాలుక ఆరోగ్యంగా ఉంటుంది.

Unsplash

సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్‌, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.  సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10  ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels