నీరు తక్కువగా తాగడం సహా వివిధ కారణాలతో చలికాలంలో కొందరిలో మలబద్ధకం సమస్య వస్తుంటుంది. శీతాకాలంలో ఈ సమస్య తగ్గేందుకు ఈ ఐదు టిప్స్ తోడ్పడతాయి.
Photo: Pexels
వాతావరణం చల్లగా ఉండటంతో చలికాలంలో కొందరు సరిపడా నీరు తాగరు. దీంతో మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. అందుకే ప్రతీ రోజు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు సరిపడా తాగితే పేగుల కదలిక మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
Photo: Pexels
శీతాకాలంలో చాలా మంది టీ, కాఫీల రూపంలో కఫీన్ ఎక్కువగా తీసుకుంటుంటారు. దీనివల్ల కూడా మలబద్ధకానికి గురవుతారు. అందుకే సమస్య ఉన్న వారు టీ, కాఫీలను బాగా తగ్గించి వేడి నీరు తాగితే మేలు.
Photo: Pexels
చలికాలంలో ఫైబర్ ఉండే ఆహారం తక్కువగా తీసుకోవడం కూడా మలబద్ధకానికి ఓ కారణంగా ఉంటుంది. అందుకే కూరగాయలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ లాంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి.
Photo: Pexels
వాము, సోంపు, మిరియాలు, జీలకర్ర లాంటి మసాలా దినుసుల వాడకం శీతాకాలంలో పెంచుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల పేగుల కదలిక మెరుగుపడి మలబద్ధకాన్ని నివారిస్తాయి.
Photo: Pexels
చలికాలంలోనూ రెగ్యులర్‌గా వ్యాయామాలు, యోగా చేయాలి. వీటి వల్ల జీర్ణక్రియ మెరుగై మలబద్ధకాన్ని నివారించేందుకు తోడ్పడతాయి.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి