తోటకూరలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి, హిమోగ్లోబిన్ కంటెంట్ అలాగే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగటానికి ఐరన్ ముఖ్యం. హిమోగ్లోబిన్ సమస్య ఉంటే తోటకూరను ఎక్కువగా తీసుకోవచ్చు.
image credit to unsplash
ఖర్జూరం పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇంకా విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. రక్తహీనతను నివారించటానికి ఇవి తినాలి.
image credit to unsplash
మిల్లెట్స్ రోజూ తింటే, హిమోగ్లోబిన్, సీరం ఫెర్రిటిన్ స్థాయులను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఊదలు మీ డైట్‌లో చేర్చుకుంటే హిమోగ్లోబిన్ స్థాయులు పెరుగుతాయి.
image credit to unsplash
అల్ల నేరేడు, డ్రై ఆప్రికాట్లు, రాగులు, పప్పులు, మునగ ఆకులు, చింతపండు గుజ్జు, వేరుశెనగ, బెల్లం మొదలగు వాటిల్లో కూడా ఐరన్ ఉంటుంది. అవి హీమోగ్లోబిన్ స్థాయిను పెంచుతాయి.
image credit to unsplash
ఎండుద్రాక్షలో ఐరన్, రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి తోడ్పడతాయి.
image credit to unsplash
క్రమం తప్పకుండా అన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా అనీమియాను తగ్గించవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్, సీరం ఫెర్రిటిన్ స్థాయిలు మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.(
image credit to unsplash
నువ్వుల్లో వివిధ రకాలైన కీలక పోషకాలు ఉంటాయి. ఇనుము, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, రాగి, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో పాత్ర పోషిస్తాయి.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి