గడ్డం సరిగ్గ రావట్లేదని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే!
pixabay
By Sharath Chitturi Sep 18, 2023
Hindustan Times Telugu
హార్మోన్స్‌లో సమస్య, జెనెటిక్స్, సరైన పోషకాలు అందకపోవడం వంటివి గడ్డం పెరగకపోవడానికి కొన్ని కారణాలు.
pixabay
ఎంత అందంగా ముస్తాబైనా.. గడ్డం అనేది సరిగ్గా లేకపోతే, స్టైలింగ్‌లో ఏదో లోటు కనిపిస్తుంది. అందుకే బియర్డ్ కేర్ చాలా ముఖ్యం.
pixabay
గడ్డం సరిగ్గా వచ్చేందుకు, వేగంగా పెరిగేందుకు మార్కెట్లో అనేక ఆయిల్స్ ఉన్నాయి. వాటిల్లో మీకు సెట్ అయ్యేది రీసెర్చ్ చేసి తీసుకోండి. రోజూ అప్లై చేస్తే ఫలితాలు వస్తాయి.
pixabay
తల మీద జుట్టుతో పాటు గడ్డాన్ని కూడా రెగ్యులర్‌గా బ్రష్ చేస్తూ ఉండాలి. తొలినాళ్లల్లో ట్రిమ్మింగ్ చేయకండి. కొన్ని నెలల తర్వాత ట్రిమ్ చేయడం మొదలుపెట్టండి.
pixabay
వ్యాయామాలు చేయండి. టెస్టోస్టీరాన్ స్థాయి వృద్ధిచెంది శరీరంపై ఒత్తిడి తగ్గి, జుట్టు పెరుగుతుంది.
pixabay
డైట్ చాలా ముఖ్యం. కొంతకాలం జంక్ ఫుడ్‌ను పక్కన పెట్టండి. విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
pixabay
తినే ఆహారంలో విటమిన్ బీ, సీ, ఈ, బయోటిన్ ఎక్కువగా ఉండాలి. పాలు, ఆకు కూరగాయలు, గుడ్లు ఎక్కువగా తీసుకోండి.
Pixabay
ఇటీవలి కాలంలో రాగులు ఎక్కువగా తింటున్నారు. వీటితో రోగనిరోధక శక్తితోపాటుగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.