మీ ప్రేమ బంధానికి తల్లిదండ్రులు 'నో' చెబుతున్నారా? ఇలా ఒప్పించండి..

pixabay

By Sharath Chitturi
Apr 13, 2024

Hindustan Times
Telugu

పిల్లలు ప్రేమించడం, వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. అయితే కొన్ని టిప్స్​ పాటిస్తే.. తల్లిదండ్రులను ఒప్పించొచ్చు.

Pexels

ముందుగా.. మీ ప్రేమ బంధం పట్ల మీ తల్లిదండ్రుల అభ్యంతరాలను తెలుసుకుని, అర్థం చేసుకోండి. మీరు ఎలా మాట్లాడాలో అప్పుడే క్లారిటీ వస్తుంది.

Pexels

ఏ విషయాన్నైనా ఓపెన్​గా కమ్యూనికేట్​ చేయండి. ఒక రిలేషన్​ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో, మీరు ఎంత క్లారిటీతో ఉన్నారో వారికి తెలియాలి.

Pexels

ప్రేమించాను అని చెప్పకముందే.. మీరు ప్రేమించిన వారిని కుటుంబంలోకి పరిచయం చేయండి. వారిలో కలిసిపోయే విధంగా ప్లాన్​ చేయండి.

Pexels

ప్రేమ, పెళ్లి, జీవితం పట్ల.. మీ ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకోండి.

Pexels

మీ మీద మీ తల్లిదండ్రులకు ఉన్న అంచనాలను గుర్తించండి. మీరు ఎంచుకున్న వ్యక్తి.. ఏ విధంగా మీ లైఫ్​లో సాయం చేస్తున్నారో చెప్పండి.

Pexels

ఒకరిపై ఒకరు కోపడుతూ ఉంటే.. సమస్య మరింత పెద్దగా మారుతుంది. ఏం ఉన్నా కూర్చుని మాట్లాడుకుంటేనే రెండువైపుల ఉన్న వారికి అర్థమవుతుందని గుర్తుపెట్టుకోండి.

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels