కిడ్నీలను దెబ్బతీసే ఆరు అలవాట్లు ఇవి.. జాగ్రత్తగా ఉండండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Nov 05, 2024
Hindustan Times Telugu
కొన్ని రకాల అలవాట్లు మూత్రపిండాల (కిడ్నీ) ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వాటి పట్ల జాగ్రత్త వహించాలి. కిడ్నీలను దెబ్బతీసే ముఖ్యమైన ఆరు అలవాట్లు ఇవే.
Photo: Pexels
ప్రతీ రోజు తగినంత నీరు తాగకపోవడం వల్ల కిడ్నీల్లో కలుషిత వ్యర్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతీ రోజు తగినంత నీరు తాగాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.
Photo: Pexels
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా కిడ్నీలకు చేటు జరుగుతుంది. దీనివల్ల మూత్రపిండాలకు సమస్య పెరుగుతుంది. అందుకే ఎక్కువ గంటలు ఒకే చోట కూర్చోకుంటా మధ్యమధ్యలో లేస్తూ తిరుగుతూ ఉండాలి.
Photo: Pexels
ఆల్కహాల్ రెగ్యులర్‌గా తాగడం వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. అందుకే మద్యం అలవాటు మానేయాలి.
Photo: Pexels
ప్రాసెస్డ్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు లాంటి జంక్ ఫుడ్‍లో సోడియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అతిగా తింటుంటే కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది. జంక్ ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది.
Photo: Pexels
కృత్తిమ తీపి పదార్థాలు మరీ అతిగా తినడం కూడా కిడ్నీలకు మంచిది కాదు. ఆర్టిఫిషయల్ స్వీట్నర్స్ మూత్రపిండాలకు చేటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని మరీ ఎక్కువగా తినకూడదు.
Photo: Pexels
తగినంత సమయం నిద్రపోకపోతే కూడా కిడ్నీలపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే సరైన నిద్ర చాలా ముఖ్యం.
Photo: Pexels
చలికాలంలో ధనియాల నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!