డయాబెటిస్‌ నియంత్రణలో తీపి పదార్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

By Bolleddu Sarath Chandra
Oct 28, 2024

Hindustan Times
Telugu

కొందరు తీపి పదార్ధాలను తినకుండా నియంత్రించుకోలేరు. కాఫీ, టీలను తాగకుండా ఉండలేరు. అలాంటి వారి కోసం కృత్రిమ తీపి రుచిని అందించే పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి

కృత్రిమ తీపి వస్తువుల్లో కెలోరోజెనిక్ తీపి పదార్ధాలు, నాన్ కెలోరోజెనిక్ తీపి పదార్ధాలు ఉన్నాయి

శక్తినిచ్చే కెలోరోజెనిక్ తీపి పదార్ధాల్లో ఫ్రక్టోస్ పొడి రూపంలో ఉంటుంది. సార్బిటాల్ ద్రవ రూపంలో ఉంటుంది.  తేనెలో ఫ్రక్టోస్, గ్లూకోజ్ సమపాళ్లలో  ఉంటుంది.

ఫ్రక్టోజ్ పొడి రూపంలో ఉంటుంది.  కాఫీ, టీ, డ్రింక్స్‌లో వినియోగిస్తారు. అధికంగా వినియోగిస్తే జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. 

సార్బిలాల్‌ను కూడా షుగర్‌కు ప్రత్యామ్నయం వినియోగిస్తారు. ఎక్కువగా వాడితే విరోచనాలు అవుతాయి.

శరీరానికి ఎలాంటి శక్తిని ఇవ్వకుండా తీపి రుచిని అందించే  వాటిలో శాకరిన్ ఉంటుంది.  ప్రపంచ వ్యాప్తంగా షుగర్‌కు ప్రత్యామ్నయంగా వాడుతున్నారు. సూక్రోజ్‌ కంటే 400 రెట్లు తియ్యగా ఉంటుంది.   డయాబెటిస్ రోగులు రోజుకు 300మిల్లీ గ్రాములకు మించి వినియోగించకూడదు. 

ఆస్పార్టేమ్ కూడా మధుమేహ రోగులు వినియోగించవచ్చు.  రోజుకు 50మి.గ్రాకంటే అధికంగా వినియోగించరాదు.

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels