హైదరాబాద్ టూ సాగర్ - కృష్ణా నదిలో బోటింగ్, రూ. 800కే వన్ డే టూర్ ప్యాకేజీ
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Jun 16, 2024
Hindustan Times Telugu
నాగార్జున సాగర్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
image credit to unsplash
కేవలం ఒకే ఒక్క రోజులోనే సాగర్ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి శనివారం, ఆదివారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్తారు.
image credit to unsplash
ఈ ప్యాకేజీ షెడ్యూల్ చూస్తే…. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ పర్యాటక భవన్ నుండి, 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.
image credit to unsplash
ఉదయం 11:40 గంటలకు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్దవనం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు. . తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత నాగార్జునకొండ కు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్కడ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు.
image credit to unsplash
సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్ ను సందర్శిస్తారు. 5 గంటలకు నాగార్జున సాగర్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ వన్ డే టూర్ ముగుస్తుంది.
image credit to unsplash
హైదరాబాద్ - సాగర్ ట్రిప్ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 800, పిల్లలకు 640గా నిర్ణయించారు.
image credit to unsplash
https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి నాగార్జున సాగర్ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
image credit to unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి