సబ్జా విత్తనాలను తులసి గింజలు లేదా తుక్మారియా అని పిలుస్తారు. సబ్జా గింజలతో ఆరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
pexels
హైడ్రేషన్ - సబ్జా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు అవి ఉబ్బి జిలాటినస్ పూతను ఏర్పారుస్తాయి. ఈ పూత నీటిని కలిగి ఉండడంతో శరీరం హైడ్రేటెడ్ గా ఉండేందుకు సాయపడుతుంది. అందుకే వేసవిలో సబ్జా గింజల నీళ్లను తాగమని సూచిస్తారు.
twitter
సమృద్ధిగా పోషకాలు - సబ్జా గింజల్లో ఫైబర్ విటమిన్లు A, K, C, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు మూలం. ఈ పోషకాలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
pexels
బరువు తగ్గేందుకు - సబ్జా గింజలు బరువు నిర్వహణకు ఉపయోగపడతాయి. వీటిని నీటిలో కలిపినప్పుడు సబ్జా విత్తనాలు కరిగి జెల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. సబ్జా నీళ్లు తాగితే ఆకలి అనుభూతి తగ్గుతుంది. దీంతో బరువు తగ్గేందుకు సాయపడుతుంది.
twitter
జీర్ణ క్రియ - సబ్జా గింజల్లో ఉండే పీచు పదార్థం, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సబ్జాలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. పేగు కదలికలకు సాయపడుతుంది.
twitter
షుగర్ లెవల్స్ కంట్రోల్- రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సబ్జా గింజలు సహాయపడతాయి. సబ్జా గింజల్లోని ఫైబర్ చక్కెర శోషణను నెమ్మది చేస్తుంది.
twitter
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు- సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తటస్థీకరిస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు సాయపడతాయి. (ఇంటర్నెట్ ఆధారిత సమాచారంతో మీకు అందిస్తున్నాం. ఈ అంశాలు అవగాహనకు మాత్రమే)
twitter
వేరుశనగలతో బరువు తగ్గింపు...! ఈ విషయాలను తెలుసుకోండి