వేసవిలో సీతాఫలం తినడం వల్ల కలిగే 6 ఆరోగ్య ప్రయోజనాలివే!  

pexels

By Bandaru Satyaprasad
May 07, 2024

Hindustan Times
Telugu

సీతాఫలం భారతదేశంలో వేసవి నెలలో ఎక్కువగా తినే ఆస్వాదించే పండు. దీని గుజ్జును డిజర్ట్ లు, జ్యూస్, స్నాక్స్ గా ఉపయోగిస్తారు. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తోంది సీతాఫలం.  

pexels

హైడ్రేషన్ - సీతాఫలంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండటానికి ఈ పండు మంచి ఎంపిక. సీతాఫలం తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల శరీరం కోల్పోయిన ద్రవాలను పొంది డీహైడ్రేషన్ ను నివారిస్తుంది.  

pixabay

సమృద్ధిగా పోషకాలు - తీపిగా ఉన్నప్పటికీ సీతాఫలంలో తక్కువ కేలరీలు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి.  

pexels

రోగ నిరోధక శక్తి పెంపు - సీతాఫలంలోని విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వేసవిలో క్రమం తప్పకుండా సీతాఫలం తింటే అనారోగ్యాలు దరిచేరవు.  

pexels

కూలింగ్ ఎఫెక్ట్ - సీతాఫలంలోని కూలింగ్ ఎఫెక్ట్ వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు సాయపడుతుంది. సీతాఫలం తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేడి సంబంధిత అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. 

pexels

జీర్ణక్రియకు తోడ్పడుతుంది- సీతాఫలంలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  

pixabay

చర్మ ఆరోగ్యానికి మేలు- సీతాఫలంలోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సపోర్ట్ చేస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది. క్రమం తప్పకుండా సీతాఫలం తింటే శరీర ముడతలు తగ్గుతాయి. స్కిన్ టోన్ పెరుగుతుంది.  

pexels