మహిళల్లో డెలివరీ తర్వాత పొట్ట భాగంగా స్ట్రెచ్ మార్క్స్ రావడం సహజం. అలాగే బరువులో మార్పులతో కొందరికి స్ట్రెచ్ మార్క్స్  వస్తాయి. కొన్ని వైద్య చికిత్సలు, ఇంటి చిట్కాలు స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి సహాయపడతాయి.  

pexels

By Bandaru Satyaprasad
Sep 15, 2024

Hindustan Times
Telugu

స్ట్రెచ్ మార్క్స్ కాలక్రమేణా చర్మంలో కలిసిపోతాయి. స్ట్రెచ్ వచ్చిన చోట చర్మం కాస్త ఎర్రగా ఉంటుంది. వీటిని తగ్గించుకునే సహాజమైన ఇంటి చిట్టాలివే.  

pexels

హైలురోనిక్ యాసిడ్ - హైలురోనిక్ యాసిడ్ మాయిశ్చరైజింగ్, స్కిన్ కేర్ కోసం ఉపయోగిస్తుంటారు. దీనిని క్రీమ్ లు, లోషన్లు, సీరమ్‌లలో ఉపయోగిస్తారు.  హైలురోనిక్ యాసిడ్ స్కిన్ స్ట్రెచ్ ను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.  

pexels

విటమిన్ ఎ- స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉండే విటమిన్ ఎ ను రెటినోయిడ్ అని పిలుస్తారు. రెటినాయిడ్స్ చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.  విటమిన్ ఎ ఉత్పత్తులు కొన్నిసార్లు చర్మాన్ని చికాకు పెడతాయి. ప్రెగ్నెంట్స్, బాలింతలు, ప్రెగ్నేన్సీ ప్లాన్ చేస్తు్న్న వారు వీటిని వినియోగించకపోవడమే మంచిది.   

pexels

సెంటెల్లా ఆసియాటికా అనేది కొరియన్ బ్యూటీ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. దీనినే సికా క్రీమ్ లుగా పిలుస్తారు. చర్మంపై మచ్చలను తగ్గించడానికి, సున్నితమైన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగిస్తారు. సెంటెల్లా స్కిన్ ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.  

pexels

షుగర్ స్క్రబ్ - షుగర్ స్క్రబ్ ఒక ప్రసిద్ధ ఎక్స్‌ఫోలియేటర్. షుగర్ లోని చిన్న స్ఫటికాలతో డెడ్ స్కిన్‌పై సున్నితంగా స్క్రబ్ చేస్తే మీకు మృదువైన అనుభూతిని కలిగిస్తాయి. 

pexels

అర కప్పు చక్కెరకు బాదం నూనె లేదా కొబ్బరి నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ పై  అప్లై చేయండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు రిపీట్ చేయండి. అనంతరం వెచ్చని నీటితో స్నానం చేయండి.  

pexels

అలోవెరా - కలబందను చర్మ సమస్యలకు ఉపయోగిస్తారు. అలోవెరా జెల్లీని నేరుగా చర్మానికి పూయడం ద్వారా స్కిన్ హైడ్రేట్ గా ఉండి ఉపశమనం పొందవచ్చు.  

pexels

కొబ్బరి నూనె - వర్జిన్ కొబ్బరి నూనె చర్మానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ వద్ద కొబ్బరి నూనెను రాస్తే కొంత మేర ఉపశమనం ఉంటుంది.   

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels