భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన శ్రీరామ మందిరాలు ఉన్నాయి. వీటిల్లో అద్భుతమైన 10 ఆలయాల గురించి తెలుసుకుందాం. 

pixabay

By Bandaru Satyaprasad
Apr 16, 2024

Hindustan Times
Telugu

అయోధ్య రామమందిరం, ఉత్తరప్రదేశ్- అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. ఇక్కడ రామమందిరం కోసం హిందువులు ఎంతో పోరాటం చేశారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది.   

twitter

భద్రాచలం సీతా రామచంద్రస్వామి ఆలయం, తెలంగాణ- భారతదేశంలోని ప్రసిద్ధ రామమందిరాల్లో భద్రాచలం ఒకటి. శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో సీతారాముల కల్యాణం  కోలాహలంగా నిర్వహిస్తారు.   

twitter

త్రిప్రయార్ రామమందిరం, కేరళ- ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఇక్కడి శ్రీరాముడిని త్రిప్రయారప్పన్ అని పిలుస్తారు. 

twitter

కోదండ రామాలయం, ఒంటిమిట్ట- ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్‌ఆర్ జిల్లాలో ఒంటిమిట్టలో ఈ ప్రాచీన దేవాలయం ఉంది.  ఒంటిమిట్ట ఆంధ్రా భద్రాచలం గా పిలుస్తారు.   

twitter

రామస్వామి ఆలయం, తమిళనాడు- తమిళనాడు కుంభకోణంలో రామస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 400 ఏళ్ల క్రితం రఘునాథ నాయకర్ నిర్మించారు.   

twitter

రామమందిరం, భువనేశ్వర్, ఒడిశా- ఈ ఆలయం భువనేశ్వర్‌లోని ఖరావెల్ నగర్ సమీపంలో ఉంటుంది. ఒడిశాలో అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఇది ఒకటి.   

twitter

కోదండరామ దేవాలయం, కర్ణాటక- చిక్కమగళూరు జిల్లాలోని హిరేమగళూరులో ఈ ఆలయం ఉంది.   

twitter

రామ్ రాజా ఆలయం, మధ్యప్రదేశ్- ఈ రామమందిరం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో బెత్వా నది ఒడ్డున ఉంది.   

twitter

కాలరామ్ టెంపుల్, నాసిక్, మహారాష్ట్ర- మహారాష్ట్రలోని నాసిక్ పంచవటి ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. రాముడు వనవాస సమయంలో నివసించిన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించారని అంటారు. 1782లో దీనిని నిర్మించారు.   

twitter

శ్రీ రామ్ తీర్థ్ ఆలయం, అమృత్ సర్- పంజాబ్ లోని అమృత్‌సర్‌కు 12 కి.మీ దూరంలోని చోగావాన్ లో ఈ ఆలయం ఉంది. వాల్మీకి ఆశ్రమంలో సీతా దేవి ఆశ్రయం పొందిన ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి. లువకుశలకు జన్మనిచ్చిన ప్రదేశంగా పిలుస్తారు.   

twitter