ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమిని దేశమంతటా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కృష్ణాలయాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. జన్మాష్టమి నాడు ఉట్టికొట్టడం ఎంతో ఉత్సహవంతంగా ఉంటుంది.  

twitter

By Bandaru Satyaprasad
Aug 24, 2024

Hindustan Times
Telugu

శ్రీకృష్ణుడి పుట్టిన రోజున జన్మాష్టమి నిర్వహిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణాష్టమి జరుపుకుంటున్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి ప్రధాన వేడుకలలో దహీ హండి(ఉట్టికొట్టడం) ఒకటి.   

twitter

దేశంలోని అనేక ప్రాంతాల్లో జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కృష్ణాష్టమి వేడుకల వైభవాన్ని చూసేందుకు ఈ ఐదు ప్రదేశాలకు తప్పకుండా వెళ్లాల్సిందే.  

twitter

మధుర- మధుర శ్రీకృష్ణుని జన్మస్థలం. జన్మాష్టమి నాడు మధుర నగరం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. దేవాలయాలను ఎంతో సుందరంగా అలంకరిస్తారు. శ్రీకృష్ణుని పుట్టినరోజుకు సంబంధించిన ఆచారాలను పాటిస్తారు.   

twitter

బృందావనం - శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని బృందావనంలో గడిపాడని అంటారు. మధురకు సమీపంలోని బృందావనంలో.. శ్రీకృష్ణుడు రాధ, ఇతర గోపికలతో సరదాగా గడిపిన ప్రదేశంగా నమ్ముతారు. 

twitter

ద్వారక- శ్రీకృష్ణుడు మధుర నుంచి ద్వారక చేరుకున్నాడని, ద్వారక శ్రీకృష్ణుని రాజ్యం అని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు ద్వారకలో 5 వేల సంవత్సరాలకు పైగా నివసించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ జన్మాష్టమి చాలా ఘనంగా చేస్తారు.  

twitter

గోకులం- శ్రీకృష్ణుని జీవితంలో గోకులంకు చాలా ప్రాముఖ్యత ఉంది. కృష్ణుడు జన్మించిన కొద్దికాలానికే, శ్రీకృష్ణుడు గోకులానికి తీసుకెళ్లారని, అక్కడ యశోద,  నంద రాజు వద్ద పెరిగాడని అంటారు. కృష్ణుడు గోకులానికి వచ్చినందుకు గుర్తుగా జన్మాష్టమి తర్వాత రోజు గోకులాష్టమి నిర్వహిస్తారు.  

twitter

ముంబయి- శ్రీ కృష్ణ జన్మాష్టమిని ముంబయిలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఉట్టికొట్టే వేడుకలు ఎంతో ఉత్సాహవంతంగా ఉంటాయి.   

twitter

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels