ఇటీవల ప్రతీది కల్తీ అయిపోతుంది. నాసిరకం పదార్థాలు, పురుగు మందుల అవశేషాలు, వివిధ రసాయనాలతో ఆహార పదార్థాలు, మసాలా దినుసులు కల్తీ చేస్తున్నారు.  

pexels

By Bandaru Satyaprasad
May 08, 2024

Hindustan Times
Telugu

మీరు వినియోగించే స్పైసెస్ కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఇంట్లోనే సులభంగా చెక్ చేసుకోవచ్చు. ప్యాక్ చేసిన మసాలా దినుసులు లేదా స్థానికంగా కొనుగోలు చేసిన స్పైసెస్...నిజమైనవా కాదా అని చెక్ చేయండి.   

pexels

దేశంలో మసాలాల కల్తీ కేసులు పెరుగుతున్నాయని భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) నివేదికలను చెబుతున్నాయి. అనేక బ్రాండ్‌లు మసాలాల తయారీలో హానికరమైన రసాయనాల వినియోగిస్తున్నాయని హెచ్చరిస్తోంది.  

pexels

పసుపు రంగు పరీక్ష- కల్తీ పసుపును గుర్తించడం చాలా కష్టం. పసుపును చెక్ చేయడానికి రెండు గ్లాసుల నీటిని తీసుకొని వాటికి కొద్దిగా పసుపు కలపండి. ఒరిజినల్ ప్రొడక్ట్ లేత పసుపు రంగులోకి మారి గ్లాస్ దిగువన స్థిరపడుతుంది. కల్తీ పసుపు ముదురు రంగులో మారుతుంది. 

pexels

కారం పొడి పరీక్ష -ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో ఒక టీస్పూన్ కారం పొడి వేయండి. గ్లాస్ చివర్లో మిగిలిన కారంను అరచేతిలో వేసుకుని రుద్దండి. అది గట్టిగా లేదా గరుకుగా అనిపిస్తే ఆ కారంలో ఇటుక పొడి కలిపారని అర్థం. కొన్నిసార్లు కారంను సబ్బు రాయితో కూడా కల్తీ చేస్తున్నారు.    

pexels

సాల్యుబిలిటీ టెస్ట్ -ద్రావణీయత పరీక్ష దాదాపు అన్ని మసాలాలకు పనిచేస్తుంది. పొడి స్పైసెస్ ను సుద్ద లేదా పిండితో కల్తీ చేస్తున్నారు. కొద్దిగా మసాలా దినుసులను తీసుకొని గాజు గ్లాసులోని నీటితో కలపండి. అసలైన మసాలాలు పాక్షికంగా లేదా అస్సలు కరగవు. గ్లాస్ చివర్లో రెసిడ్యూ మిగులుతుంది. కానీ కల్తీ పదార్థాలు వెంటనే కరిగిపోతాయి. పాల నురగ తరహాలో ద్రావణం కనిపిస్తుంది.  

pexels

జీలకర్ర పరీక్ష- చార్ కోల్ గ్రాస్ సీడ్స్ ను జీలకర్రగా విక్రయిస్తారు. జీలకర్రను చెక్ చేయడానికి అరచేతిలో చిటికెడు జీలకర్రను తీసుకొని రుద్దండి. అరచేతులు నల్లగా మారితే లేదా అవశేషాలుగా మిలిగిపోతే  అది కల్తీ జీలకర్ర అని అర్థం.  

pexels

మిరియాల ద్రావణీయత పరీక్ష - నల్ల మిరియాల రంగు నకిలీని గుర్తించేలా చేస్తుంది. బొప్పాయి గింజలతో మిరియాలను కల్తీ చేస్తున్నారు. ఒరిజినల్ నల్ల మిరియాలు పూర్తిగా నీటిలో మునిగిపోయి గ్లాస్ చివరిలో చేరుతాయి. బొప్పాయి గింజలు నీటిపై తేలుతాయి.   

pexels

విటమిన్ బీ12 లోపం ఉందా? ఈ పండ్లను రెగ్యులర్‌గా తినండి

Photo: Pexels