చల్లటి వాతావరణంలో హాట్ హాట్ గా ఏమైనా తినాలనిపిస్తుందా? అయితే సోయా పకోడీ ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా సోయా పకోడీలు తయారు చేసుకునే రెసిపీ తెలుసుకుందాం.  

twitter

By Bandaru Satyaprasad
Jul 13, 2024

Hindustan Times
Telugu

ఉడకబెట్టిన సోయా ముక్కలు, మసాలా దినుసుల మిశ్రమానికి శనగ పిండి యాడ్ చేసి పకోడీలు వేస్తే చాలా క్రిస్పీ స్పైసీగా ఉంటాయి. ఈ పకోడీలను పుదీనా చట్నీ లేదా చింతపండు సాస్ తో వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటాయి.  

twitter

కావాల్సినవి -1 కప్పు ఉడికించిన సోయా ముక్కులు, 1 కప్పు శనగపిండి, 1 ఉల్లిపాయ(సన్నగా తరిగిన), 2 పచ్చిమిర్చి(సన్నగా తరిగిన), సన్నగా తురిమిన అల్లం, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ పసుపు, రుచికి తగిన ఉప్పు, కొత్తి మీర, తగినంత నూనె.  

twitter

Step 1 - లేత సోయా బీన్స్ ను ఉతకబెట్టి నీటిని తొలగించి మెత్తగా చేసుకోవాలి.  

twitter

Step 2 - ఒక గిన్నెలో మెత్తగా చేసుకున్న సోయా, శనగపించి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, తురిమిన అల్లం, జీలకర్ర, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.  

twitter

Step 3 - ఈ మిశ్రమానికి పసుపు, ఉప్పు, తరిగిన కొత్తమీర వేసి బాగా కలుపుకోవాలి.  

twitter

Step 4 - కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయండి. పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా నూనెలో వేసుకోండి.  

twitter

Step 5 - పకోడీలు గోధుమ రంగులోకి వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి. వాటిని బయటకు తీసి టిష్యూ పేపర్ వేయండి. ఎక్స్ ట్రా నూనెను పీల్చుకుంటాయి.  

twitter

Step 6 - ఇప్పుడు వేడి వేడి పకోడీలు రెడీ అయ్యాయి. వాటిపై కొత్తిమీరతో గార్నిష్ చేయండి. పుదీనా చట్నీతో పకోడీలను ఆస్వాదించండి.  

twitter

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels