వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. కానీ కొన్ని ఆహారాలు వృద్ధాప్యాన్ని మరింత వేగవంతం చేస్తాయి. మీరు మీ కంటే ఎక్కువ వయస్సు గలవారిలా కనిపిస్తారు. మీకు తెలియకుండానే మీ వయస్సును పెంచే 10 ఆహారాల గురించి తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Sep 10, 2024

Hindustan Times
Telugu

కాఫీ - మార్నింగ్ కప్పు కాఫీ లైఫ్ సేవర్ అయితే, ఎక్కువ కాఫీ మూత్ర విసర్జనను పెంచడం ద్వారా చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీంతో చర్మం సాధారణ వయస్సు కంటే ముందే ముడతలు పడడం, నిర్జీవంగా కనిపిస్తుంది.  

pexels

చక్కెర ఆహారాలు - స్వీట్స్ బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారి తీస్తుంది. ఇది మీ చర్మంలోని కొల్లాజెన్, ఎలాస్టిన్ ను దెబ్బతీస్తుంది. దీంతో చర్మంపై అకాల ముడతలకు దారితీస్తుంది.  

pexels

వేయించిన ఆహారాలు - వేయించిన ఆహారాలు రుచిగా ఉంటాయి. కానీ అవి ట్రాన్స్ ఫ్యాట్స్ తో నిండి ఉంటాయి. ఈ కొవ్వులు మీ చర్మంలోని కొల్లాజెన్ ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మం కాలక్రమేణా ముడతలు పడి కుంగిపోతుంది.  

pexels

మద్యం - ఆల్కహాల్ మీ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.  తక్కువ వయస్సులోనే చర్మం యవ్వన రూపాన్ని కోల్పోయేలా చేస్తుంది. 

pexels

మసాలా ఆహారాలు- మసాలా ఆహారాలు రోసేసియా వంటి చర్మ పరిస్థితులను ప్రేరేపిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్న వారిలో... తక్కువ వయస్సులోనే చర్మం పొడిబారడం, ముడతలు పడడం కనిపిస్తుంది.  

pexels

ఉప్పు ఆహారాలు - ఎక్కువ ఉప్పు తినడం వల్ల మీ శరీరం నీటిని స్టోర్ చేసుకునేలా చేస్తుంది. దీంతో కంటి చుట్టూ ఉబ్బినట్లు ఉంటుంది. ఎక్కువ కాలం ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.  

pexels

పాల ఉత్పత్తులు - కొందరిలో పాల ఉత్పత్తులు చర్మంపై మోటిమలు, ఇతర సమస్యలకు కారణమవుతాయి. మీ చర్మం వృద్ధాప్యంగా కనిపించేలా చేస్తాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తాయి.  

pexels

ప్రాసెస్ మీట్ - బేకన్, సాసేజ్ ఇన్ ఫ్లమేషన్ ను ప్రేరేపిస్తాయి. ఇవి చర్మంలోని కొల్లాజెన్ ను బలహీనపరుస్తాయి. మీరు మీ వయస్సుకు మించి పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి.  

pexels

ట్రాన్స్ ఫ్యాట్ - ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. ఇవి చర్మం వృద్ధాప్యంగా మారడం, గుండె జబ్బులకు దారి తీస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ యూవీ రేడియేషన్ కు గురిచేసే అవకాశం ఉంది.  

pexels

ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు - వైట్ బ్రెడ్, పాస్తా వంటి ఆహారాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇవి చర్మానికి హాని కలిగిస్తాయి. కాలక్రమేణాల చర్మం గ్లో, దృఢత్వాన్ని కోల్పోవచ్చు. మీరు త్వరగా వృద్ధాప్యంగా కనిపించేలా చేయవచ్చు.  

pexels

మీరు జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే తిప్పలు తప్పవు!

Image Source From unsplash