చలికాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే 6 మార్గాలు
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Nov 15, 2024
Hindustan Times Telugu
శీతాకాలంలో చల్లటి వాతావరణం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో గుండె ఆరోగ్యం కోసం పాటించాల్సిన మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.
Photo: Pexels
చలికాలంలో గుండె ఆరోగ్యం కోసం కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, చేపలు లాంటివి ఎక్కువగా తినాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు.
Photo: Pexels
చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో కొందరు వ్యాయామం చేసేందుకు ఇష్టపడరు. అది సరికాదు. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయాలి. చలికాలమైనా ఇది తప్పనిసరిగా పాటించాలి.
Photo: Pexels
గుండె పనితీరులో విటమిన్ డీ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి తగిలేలా జాగ్రత్త పడాలి. ఫ్యాటీ ఫిష్‍లు, గుడ్లు సహా విటమిన్ డీ మెండుగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
Photo: Pexels
చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఎక్కువ చలి శరీరానికి తగిలితే రక్త నాళాలకు ఇబ్బంది కలిగి.. రక్త ప్రసరణ సరిగా జరకపోయే రిస్క్ ఉంటుంది. బీపీ పెరిగితే గుండె కూడా చేటు చేస్తుంది. అందుకే ఉన్ని దుస్తులు ధరించి శరీరానికి చలి తగలకుండా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
Photo: Pexels
చలికాలంలో అయినా నీరు తగినంత తాగాలి. వాతావరణం చల్లగా ఉందని నిర్లక్ష్యం చేయకూడదు. సరిపడా నీరు తాగితేనే గుండెకు పని తీరు మెరుగ్గా ఉంటుంది. హెల్బల్ టీలు కూడా తాగొచ్చు.
Photo: Pexels
ఒత్తిడి పెరిగితే గుండె ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే ఒత్తిడి తగ్గేందుకు ప్రతీ రోజు ధ్యానం చేయాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
Photo: Pexels
శరీరంలో కొలెస్ట్రాల్‍ను సహజంగా తగ్గించగల పండ్లు ఇవి