త్వరగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడే 6 రకాల జ్యూస్‍లు

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Aug 06, 2023

Hindustan Times
Telugu

ఒక్కోసారి తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఈ జ్యూస్‍లు తాగితే.. జీర్ణయ్యేందుకు సహకరిస్తాయి. అవేంటో ఇక్కడ చూడండి. 

Photo: Pixabay

యాపిల్ జ్యూస్‍లో పెక్టిన్ అనే సోలబుల్ ఫైబర్, విటమిన్ సీ ఉంటాయి. దీంతో ఈ జ్యూస్ తాగితే జీర్ణం త్వరగా అవుతుంది. 

Photo: Unsplash

జీర్ణం అయ్యేందుకు నిమ్మరసం కూడా చాలా మంచి ఆప్షన్. నిమ్మకాయరసంలో విటమిన్ సీ, యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణవ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. 

Photo: Unsplash

ఆరెంజ్ జ్యూస్‍లో పొటాషియమ్, యాంటియాక్సిడెంట్లు, విటమిన్ సీ ఉంటాయి. అందుకే ఈ జ్యూస్ కూడా జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. 

Photo: Unsplash

సెలరీ జ్యూస్‍లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి నుంచి కూడా ఈ జ్యూస్ ఉపశమనం ఇవ్వలగదు. 

Photo: Unsplash

దానిమ్మ జ్యూస్ కూడా జీర్ణవ్యవస్థకు చాలా మేలు. కడుపులో మంటను కూడా ఇది తగ్గించగలదు. 

Photo: Unsplash

దోసకాయ రసం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది. గాస్ సంబంధించి సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని ఇవ్వగలదు. 

Photo: Unsplash

కీళ్లు, కండరాల నొప్పులు ఉన్నాయా.. అయితే ఈ చేప సరైన మందు!

Image Source From unsplash