రక్తంలో చక్కెరను తగ్గించడానికి సులభమైన వ్యాయామాలలో చురుకైన నడక, సైక్లింగ్, వర్కౌట్స్ ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి 6 వ్యాయామాలు తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Oct 26, 2024

Hindustan Times
Telugu

ఈ వ్యాయామాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి, కండర ద్రవ్యరాశిని మెరుగుపరుస్తాయి అలాగే ఒత్తిడిని తగ్గిస్తాయి. కేలరీలను బర్న్ చేస్తాయి.  

pexels

రన్నింగ్ - రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి రన్నింగ్ అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. మీరు పరిగెత్తినప్పుడు కండరాలు సంకోచించి గ్లూకోజ్‌ని శక్తిగా వినియోగిస్తాయి.   

pexels

సైక్లింగ్ - సైక్లింగ్ కేలరీలను బర్న్ చేయడానికి రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడానికి గొప్ప మార్గం. 

pexels

బ్రిస్క్ వాకింగ్ -బ్రిస్క్ వాకింగ్ రక్తంలో షుగల్ లెవల్స్ తగ్గించడానికి సమర్థవంతమైన మార్గం. వేగంగా నడిచినప్పుడు కండరాలు శక్తి కోసం గ్లూకోజ్‌ను బర్న్ చేస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గుతాయి.  

శరీర బరువు వ్యాయామాలు - బాడీ వెయిట్ వ్యాయామాలు ఇన్సులిన్ సెన్సిటివిటీ, మజిల్ మాస్ మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. లంగ్స్ , స్క్వాట్‌లు పుష్-అప్‌లు వంటి బాడీ వెయిట్ వ్యాయామాలు గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకుంటాయి.   

pexels

రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు- రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు కండరాల పెరుగుదల, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉత్తమమైన వ్యాయామాలు.   

పైలేట్స్ - పైలేట్స్ అనేది కోర్ ఎనర్జీ, ఫ్లెక్జిబిలిటీ, భంగిమపై దృష్టి పెట్టే వ్యాయామం. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామంలో శక్తి కోసం గ్లూకోజ్‌ను బర్న్ చేస్తుంది.  

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels