బరువు తగ్గడానికి యోగా అత్యంత ప్రభావంతమైన మార్గం. కేలరీలను బర్న్ చేయడానికి ఈ 7 యోగా భంగిమలను ప్రయత్నించండి. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడతాయి.
pexels
By Bandaru Satyaprasad Oct 29, 2024
Hindustan Times Telugu
చతురంగ దండాసనం(పలక)- ఈ యోగాసనంలో మీ శరీరాన్ని తల నుంచి కాలి వరకు స్ట్రెయిట్ లైన్ లో ఉంచాలి. మీ భుజాలు, చేతులు, కాళ్లలో ఎంజేగ్ చేస్తూ మీ శరీర కోర్ బలాన్ని పెంచుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. హార్ట్ బీట్ రేటును పెంచి, ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.
pexels
వీరభద్రాసన 1- ఈ యోగాసనం దిగువ శరీరాన్ని బలపరుస్తుంది. చేతులు, కాళ్లు, వీపు దిగువ భాగంలోని కండరాలను బలపరుస్తుంది. జీవక్రియ, కండరాల పెరుగుదలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
pexels
అధో ముఖస్వనాసన - ఈ ఆసనంలో మొత్తం శరీరాన్ని వంచుతారు. ఇది మీ హృదయ స్పందన రేటును పంచుతుంది. రక్త ప్రసరణను పెంచి ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
pexels
నావాసం(పడవ ఆకారం)- ఈ ఆససంలో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఈ ఆసనం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. 10-20 సెకన్ల పాటు ఈ ఆసనం ప్రయత్నిస్తే తుంటి, తొడలు, నడుము చుట్టూ ఉన్న కండరాల బలపడతాయి. పొట్ట భాగంలో ఫ్యాట్ బర్న్ అవుతుంది.
pexels
ఉత్కటాసన(కుర్చీ భంగిమ) - ఈ ఆసనంలో కూర్చున్న భంగిమను అనుకరించాలి. హార్ట్ బీట్ రేటు, జీవక్రియను పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి ఇది చక్కటి ఆసనం.
pexels
ఊర్థ్వ ధనురాసనం- బ్యాక్ బెండ్ భంగిమ ఛాతీ భాగాన్ని ఓపెన్ చేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని జాగ్రత్తగా వేయాలి లేకుంటే గాయం కావచ్చు.
pexels
నటరాజాసన- ఈ ఆసనం మీ శరీర బ్యాలెన్స్ ను మెరుగుపరుస్తుంది. నటరాజాసనం శరీర కండరాలను బలపరుస్తుంది. జీవక్రియను మెరుగుపరిచి, ఎక్కువ కేలరీలు బర్న్ చేయడంతో సహాయపడుతుంది.
pexels
దీపావళి వచ్చింది. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఎక్కడ చూసినా సంబరాలు ఉంటాయి.