గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Oct 04, 2023

Hindustan Times
Telugu

గ్యాస్ సమస్య ఉంటే ఆహారాన్ని మెల్లమెల్లగా తినాలి. తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం మంచిది.

image credit to unsplash

 గ్యాస్ సమస్యలు ఉన్న వారు తిన్న తరువాత కాస్త సోంపు నమలడం గానీ, జీలకర్ర నమలడం గానీ చేయాలి. వాము నీళ్లు కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

image credit to unsplash

ఆయిల్ ఫుడ్ సులభంగా జీర్ణం కాదు. కాబట్టి అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

image credit to unsplash

 గ్యాస్ సమస్యలు ఉన్న వారు శీతల పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ఇలాంటి ఆహార పదార్థాల వల్ల యాసిడ్ సమస్యలు తీవ్రమవుతాయి.

image credit to unsplash

తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమలడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

image credit to unsplash

తిన్న తర్వాత నడవడానికి కొంత సమయం కేటాయించండి. కనీసం 15 నుంచి 20 నిమిషాలు కూర్చోకుండా నడవండి. ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుంది

image credit to unsplash

బరువు పెరగకుండా చూసుకోవాలి. చురుగ్గా ఉంటూ, రోజూ క్రమం తప్పకుండా  వ్యాయామం చేయాలి. 

image credit to unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash