నిత్యం ఉరుకుల పరుగుల జీవితం, పనిఒత్తిడి..వీటన్నింటి నుంచి మీ మనస్సు, శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. మీకు విశ్రాంతినిచ్చి తిరిగి ఉత్తేజం చేసే ఈ ట్రిప్స్ పాటించండి.
pexels
By Bandaru Satyaprasad Aug 19, 2024
Hindustan Times Telugu
విశ్రాంతి అంటే కేవలం నిద్రపోవడమే కాదు. మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించేందుకు, మనస్సు, శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి భౌతిక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక విశ్రాంతి తీసుకోవాలి.
pexels
శారీరక ఒత్తిడి నుంచి కోలుకోవడానికి నిద్ర, పవర్ న్యాప్స్ చాలా అవసరం. ఇది మీ శక్తిని పునరుద్ధరించడానికి, శరీర పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది.
pexels
భావోద్వేగ విశ్రాంతి మీ భావాలను ప్రాసెస్ చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, భావోద్వేగ అలసటను నివారించడానికి అవసరం. ఇందుకు జర్నలింగ్, మైండ్ ఫుల్ నెస్ అభ్యాసాలు చేయండి.
pexels
సామాజిక విశ్రాంతి మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అవసరం. సామాజిక పనుల నుంచి విరామం సామాజిక అలసట, బర్న్ అవుట్ ను నివారిస్తుంది.
pexels
శబ్దాలు, ప్రకాశవంతమైన లైట్లు మీపై భారం పెంచుతున్నాయా? అందుకే ఇంద్రియ విశ్రాంతి(సెన్సరీ రెస్ట్) ముఖ్యం. మన శరీరాన్ని ఒత్తిళ్ల ఓవర్ లోడ్ నుంచి రక్షించుకునేందుకు ప్రశాంతమైన వాతావరణంలో గడపండి.
pexels
క్రియేటివ్ రెస్ట్ అనేది సృజనాత్మక పనులకు దూరంగా ఉండడం. ఇది బర్న్ అవుట్ ను నివారించడానికి సహాయపడుతుంది. ఇది మీ సృజనాత్మకతను మరింత పెంచుతుంది.
ఆధ్యాత్మిక విశ్రాంతి మిమ్మల్ని మీ అంతర్గత విశ్వాసాలతో కలుపుతుంది. ధ్యానం లేదా ప్రకృతిలో గడపడం మీ మనస్సును మరింత ప్రశాంతంగా ఉంచుతుంది.
pexels
శరీరంలో ఐరన్ సరిపడా ఉండటం ఎంతో ముఖ్యం. ఇది పుష్కలంగా లభించే కూరగాయలు కొన్ని ఉన్నాయి