Relationship Green Flags : మీ భాగస్వామితో సంబంధంలో నిబద్ధతను ప్రదర్శిస్తే వివాహ బంధం సమస్యలు లేకుండా సాగిపోతుంది. స్థిరమైన, సురక్షితమైన, దీర్ఘకాలిక వివాహ బంధం కొనసాగడానికి మీకు కొన్ని గ్రీన్ ఫ్లాగ్స్(సానుకూల చర్యలు) పాటించాల్సి ఉంటుంది.
pexels
By Bandaru Satyaprasad Feb 27, 2024
Hindustan Times Telugu
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్- కమ్యూనికేషన్ అనేది ఒక సంబంధాన్ని ఏర్పరచడానికి లేదా విడిపోవడానికి కీలకం. మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ కలిగి ఉంటే మీ బంధానికి ఢోకాలేదు. అవతలి వ్యక్తికి మీ భావాలను నిజాయితీగా వ్యక్తీకరించడంలో కమ్యూనికేషన్ కీలకం.
pexels
మానసిక/భావోద్వేగ ఆరోగ్యం- మానసిక, భావోద్వేగ చర్యలను ఎలా నియంత్రించాలో తెలుసుకోవడం, భాగస్వామి భావోద్వేగాలకు గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం.
pexels
ఒకరినొకరు విశ్వసించడం-ఆరోగ్యకరమైన వివాహ బంధం ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం. మీ భాగస్వామితో జవాబుదారీగా ఉండాలి. ఆరోగ్యకరమైన శృంగార సంబంధంలో నమ్మకం ఒక అంతర్భాగం.
pexels
వ్యక్తిత్వ గుర్తింపు- ప్రతి వ్యక్తి కొన్ని అభిరుచులు, సంబంధాలు, స్నేహితులు, వారు ఆనందించే కార్యకలాపాలు ఉంటాయి. వివాహ బంధంలో భాగస్వామి వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. వారి ఆనందాలకు సమయం ఇవ్వాలి.
pexels
ఒత్తిడి తగ్గించడం- వివాహ జీవితంలో భాగస్వామిపై భారం ఉంటుంది. మీరు చూపించే ప్రేమ, వారికి అందించే మద్దతుతో ఒత్తిడి తగ్గుతుంది. వారికి నైతిక మద్దతు అందించండి.
pexels
ఫైటింగ్ ఫెయిర్- మీ భాగస్వామితో విభేదాలు వచ్చినప్పుడు...పరిష్కారం ఆలోచించండి. కారణాలు అన్వేషించి సమస్యలకు చెక్ పెట్టండి. మరలా అలాంటి చర్చ మీ మధ్య రాకుండా చూసుకోండి.
pexels
కోపం నియంత్రణ- వివాహ బంధంలో కోపం నియంత్రణ చాలా ముఖ్యమైనది. చిరాకు, కోపం ప్రవర్తనతో మీ భాగస్వామి చాలా బాధపడవచ్చు. మీ ప్రవర్తనతో భాగస్వామి కలత చెందినప్పుడు ఎలా స్పందిస్తారో గమనించండి. ప్రతి విషయానికి కోపం తెచ్చుకోవడం, నలుగురిలో అవమానించడం, చేయిచేసుకోవడం బాధ కలిగించే ఇతర పనులను మానుకోండి.
pexels
చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!